అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయ నిపుణుల ప్రతిభకి ఎప్పటికప్పుడు
అక్కడి ప్రభుత్వం పట్టం కడుతూనే ఉంటుంది. ఎంతో మంది ఇండో అమెరికన్స్ ని అమెరికా
కీలక శాఖల్లో నియమించి ప్రతిభకి తగ్గ గుర్తింపు ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ
ఇండో అమెరికన్ శాస్త్రవేత్తకి అరుదైన గుర్తింపు ఇచ్చింది అమెరికా.
జీవ శాస్త్రవేత్తగా, ప్రొఫెసర్ గా అంతకంటే ముఖ్యంగా సామాజిక ఉద్యమ కారుడిగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ ఇండో అమెరికన్ శాస్త్రవేత్త శ్రీనాథ్‌కు ప్రఖ్యాత క్లీవ్‌లాండ్ ఇంటర్నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌గా గౌరవం లభించింది. ఎన్నో రంగాలలో సేవలు చేసినందుకు గాను ఈ గౌరవానికి ఆయన్ని ఎంపిక చేశారు.
కేస్ వెస్టర్స్ రిజర్వ్ యూనివర్సిటీలో ఎంతో కాలంగా ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆయన ,సేవా ఇంటర్నేషనల్ సంస్థకు అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. బెంగుళూరు విశ్వవిద్యాలయం లో బీఈ , ఐఐఎస్సీ ,ఎంఈ పూర్తి చేశారు.