జపాన్ లో జరిగిన ఈ ఘటన ఆ యూనివర్సిటీ  ప్రొఫెసర్ ని షాక్ కి గురించేసింది. అంతేకాదు ఆ పేపర్ చూసి ప్రొఫెసర్ ఫుల్ మార్క్ లు ఇచ్చేసి తెగ మెచ్చుకున్నాడు. అదేంటి తెల్ల పేపర్ ఇస్తే ఫుల్ మార్క్స్ ఎలా వేస్తారు ఇదెక్కడి న్యాయం మిగిలిన విద్యార్ధులు నష్టపోతారు కదా అంటూ ఆలోచన చేయకండి. అసలు విషయం ఏమిటంటే.

 

జపాన్ లోని మెయ్ అనే యూనివర్సిటీలో  ప్రొఫెసర్ జపాన్ సంస్కృతీ గురించి తెలిసిలే ఓ వ్యాసాన్ని రాయమని చెప్పాడు. సరే కదా అనుకున్న విద్యార్ధులు అందరూ ఎవరికీ తోచింది వారు రాస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమిహగా అనే ఓ విద్యార్ధిని తమ దేశ సంస్కృతీ గురించి కొత్తగా ఏదన్నా రాయాలని అనుకుంది. అందరిలా కాకుండా విభిన్నంగా ఉండటానికి ప్రయత్నించే ఆమె నిజంగానే కొత్తగా ఆలోచన చేసింది.

 

మరుసటి రోజు ప్రొఫెసర్ రాసిన పేపర్స్ అన్ని తీసుకుంటున్న క్రమంలో ఆమె కూడా తన పేపర్ ఇచ్చింది. కానీ అది తెల్లటి పేపర్. అది చూసిన ప్రొఫెసర్ ఆమెపై కోపంతో ఊగిపోయాడు. ఇదేంటి అంటూ మండిపడ్డాడు. దాంతో ఆమె సర్ ఇందులో మన సంస్కృతీ గురించి రాశాను చాలా కొత్తగా రాశాను అని చెప్పింది. అప్పటికే మంట మీద ఉన్న అతడు పేపర్ అటూ ఇటూ తిప్పి చూస్తే ఏమి కనపడలేదు.దాంతో మరింత ఫైర్ అయ్యాడు.

 

అప్పుడు ఆమె తానూ ఎలాంటి ట్రిక్ ఉపయోగించి ఆ వ్యాసం రాసిందో వివరించింది. అదేంటంటే జపాన్ లో నింజా సంస్కృతీ ఎంతో గొప్పది వారు  రాసే ఉత్తరాలు ఎవరూ చదవలేరు. అవి చదవాలంటే  వాటిని ఉత్తరాన్ని వేడి చేస్తేనే గాని ఆ లెటర్స్ కనపడవు. వేడి తగ్గగానే లెటర్స్ కూడా మాయం అవుతాయి. ఈ విషయం చెప్పగానే ప్రయత్నించి చూసిన ప్రొఫెసర్ కి కళ్ళు చెదిరిపోయాయి.దాంతో ఆమెని మెచ్చుకుని ఫుల్ మార్క్స్ ఇచ్చేశాడు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: