ప్రపంచంలో అగ్ర దేశంగా వెలుగొందుతున్న అమెరికాలో ఇప్పుడు గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా అక్రమ ఆయుధాలతో విచ్చల విడిగా స్వైర విహారం చేస్తున్నారు. అంతే కాదు అక్కడ కొన్ని ప్రదేశాల్లో బహిరంగంగానే గన్స్ అమ్మడం విశేషం. ఒక వైపు గన్ కల్చర్ పై ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు ఇస్తారు ఒబామా. గన్ కల్చర్ కి తాను పూర్తిగా వ్యతిరేకినని కొందరు ఉన్మాదులు అమాయ ప్రాణాలు తీస్తుంటే తాను చలించిపోయానని చాలా సార్లు చెప్పారు.

అమెరికాలో మరోసారి కాల్పుల సంఘటన కలకలం రేపింది. ఒహియో మిడిల్ టౌన్ లోని మాడిసన్ స్కూల్లో ఒక విద్యార్థి కాల్పులు జరిపాడు. స్కూల్ లంచ్ రూమ్ లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. వెంటనే తేరుకున్న స్కూల్ యాజమాన్యం అక్కడకు వెళ్లి చూడగా ద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి.మరో ఇద్దరికి తూటాభాగాలు తగిలాయి. వెంటనే ఆ విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

అయితే కాల్పులకు పాల్పడిన విద్యార్థి అక్కడ నుంచి పారిపోయి  చిన్నగుట్టల్లో నక్కి కొద్ది సేపు తర్వాత గన్ విసిరివేసి వెళుతుండగా అక్కడి స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పినట్లు తెలుస్తుంది. ఆ విద్యార్థని అరెస్టు చేసిన పోలీసులు అసలు విద్యార్థికి ఆ గన్ ఎలా వచ్చిందీ అన్న విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: