భారత దేశం నుంచి ఉన్నత చదువుల కోసం..మంచి ఉద్యోగాల కోసం చాలా మంది అమెరికా వెళ్లడం తెలిసిందే. అక్కడ స్థిరపడిన వారు భారత సాంప్రదాయాలు, ఇక్కడి కట్టుబాట్లు కొనసాగిస్తున్నారు. ఇక ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు..ముఖ్యంగా అమెరికాలో తానా ఏర్పడి తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా వెళుతుంటారు.


తాజాగా  తానా కేర్స్‌ కార్యక్రమంలో భాగంగా అట్లాంటాలోని తానా నాయకులు కుకింగ్‌ అండ్‌ ఫీడింగ్‌ ది హంగ్రీ పేరిట ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ   కార్యక్రమం తానా కేర్స్‌ అని, ఇందులో భాగంగా వివిధ ఆరోగ్య, విద్య, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తానా నాయకుడు లావు అంజయ్య చౌదరి తెలిపారు. తాము తయారు చేసిన వివిధ రకాల వంటలను రెండు వ్యాన్‌లలో అట్లాంటా మెట్రో టాస్క్‌ ఫోర్స్‌ వలంటీర్లు ఇల్లులేని పేదలకు పంపిణీ చేసినట్లు అంజయ్య చౌదరి చెప్పారు.


ఈ సేవా కార్యక్రమానికి సహకారాన్ని అందించిన షాలు కౌర్‌కు తానా అట్లాంటా నాయకులు అంజయ్య చౌదరి లావు, అనిల్‌ యలమంచిలి, శరత్‌ పుట్టి, మురళీ బొడ్డు, మహేష్‌ కొలగొట్ల ధన్యవాదాలు తెలియజేశారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: