ఉపాది కోసం ఎంతో మంది మహిళలు గల్ఫ్ దేశాలకు వెళ్లడం అక్కడ దళారుల చేత మోసపోయి..యజమానుల చేత చిత్ర హింసలకు గురి కావడం ఆపై వ్యభిచారుల చేతుల్లో చిక్కుకోవడం నిత్య కృత్యం అయ్యింది. ఇలా మోస పోయిన మహిళలు దుర్భర జీవితాలు గుడుపుతూ..తమ వాళ్లకు దూరమై నరకం అనుభవిస్తుంటారు. ఇలా జరిగిన చాలా మంది మహిళలను మన రాయబార కార్యాలయ అధికారులు స్పందించి వ్యభిచార కూపం నుంచి రక్షించి స్వదేశానికి తరలించారు.

అయితే ఇలాంటి భాదితులు అక్కడ చాలా మంది ఉన్నారు. తాజాగా ఇంటి పనిమనుషుల పేరిట గల్ఫ్ కు అమ్మాయిల అక్రమ రవాణా చేయడానికి తాజా కేంద్ర నిర్ణయంతో తెరపడనుంది.  ఇక మహిళా ఇంటిపనిమనుషుల గల్ఫ్ రిక్రూట్ మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారానే చేయాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక18 దేశాలకు వెళ్లే ఇంటి పనిమనుషుల రిక్రూట్ మెంట్ ఇకనుంచి ప్రభుత్వం ఆధీనంలోని ఆరు ఏజెన్సీలు మాత్రమే చేస్తాయని రూట్స్ అండ్ ఓవర్ సీస్ డెవలప్ మెంట్ ఎంప్లాయ్ మెంట్ ప్రమోషన్ కార్యదర్శి ఉషా టిటూస్ చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: