అమెరికన్లకు ఉద్యోగాలు.. మన ఉద్యోగాలు మనకే.. వంటి నినాదాలతో అధికారంలోకి వచ్చిన డోనాల్డ్ ట్రంప్.. ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేశాక హామీలను తీర్చే పనిలో పడ్డారు. అందులో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో మాట్లాడటమే కాకుండా.. ఇతర దేశాధ్యక్షులతోనూ సమావేశమవుతున్నారు. అయితే ట్రంప్ ఆశయాలకనుగుణంగా అమెరికన్లకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు జపాన్ ముందుకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా.. ఏడు లక్షల అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కలిగేలా అగ్రరాజ్యంలో పెట్టుబడులు పెడతామంటూ తేల్చిచెప్పింది.



ఫిబ్రవరి పదవ తారీఖున జపాన్ ప్రధానమంత్రి షింజో అబే.. వాషింగ్టన్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనలో ట్రంప్‌తో సమావేశమవనున్నారు. మొత్తం మీద అమెరికాలో 450 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. హైస్పీడ్ రైళ్లు, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో పెట్టుబడులు ఉంటాయని పూర్తి వివరాలను ప్రధాని పర్యటన అనంతరం వెల్లడిస్తామని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: