అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌ ‘మేడిన్‌ ఇండియా’కు సై అంటోంది. ఇందులో భాగంగా ఈ నెల్లోనే బెంగళూరులో ‘ఐఫోన్‌ ఎస్‌ఇ’ హైఎండ్‌ స్మార్ట్‌ ఫోన్లు ఉత్పత్తి చేసి దేశీయ మార్కెట్లో విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. అయితే ప్రారంభంలో ఈ ఫోన్ల ఉత్పత్తి పరిమిత స్థాయిలోనే ఉంటాయని పేర్కొంది. బెంగళూరు సమీపంలోని పీన్యా దగ్గర విస్ట్రన్‌ అనే తైవాన్‌ కంపెనీ, యాపిల్‌ కోసం ఈ ఐఫోన్లు తయారు చేయనుంది. ప్రస్తుతం భారతలో అమ్మే ఐఫోన్లను యాపిల్‌ కంపెనీ పూర్తిగా దిగుమతి చేసుకుని అమ్ముతోంది.దీంతో దిగుమతి సుంకం భారం పెరిగి శాంసంగ్‌ వంటి కంపెనీలతో పోటీపడలేక పోతోంది. భారతలోనే ఐఫోన్లు తయారు చేస్తే దిగుమతి సుంకం భారం ఉండదు. తద్వారా మరింత తక్కువ ధరకే అమ్మడం ద్వారా భారత మార్కెట్‌పై మరింత పట్టు పెంచుకోవచ్చని భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: