పదకవితా పితామహునిగా పేరొందిన అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ డాక్టర్‌ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రాంగణమంతా తెలుగుదనం ఉట్టిపడేలా పద్మావతి, వేంకటేశ్వరుల విగ్రహాలతో కూడిన మంటపం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా సిలికానాంధ్ర ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా అమెరికాలోని నాలుగు ప్రధాన నగరాల్లో జరిగిన సంగీత, నృత్య పోటీల్లోని గెలుపొందిన విజేతలు కాలిఫోర్నియాకు తరలివచ్చారు.



శనివారం ఉదయం నుంచి సాయంత్రం అన్నమయ్య సంకీర్తనలు, మనోధర్మ సంగీతంలో పోటీలు నిర్వహించారు. అనంతరం తితిదే ఆస్థాన విద్యాంసులైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ తనయుడు అనిల్‌కుమార్‌ అనురాధ శ్రీధర్‌(వయోలిన్‌), రవీంద్రభారతి శ్రీధరన్‌(మృదంగం) వాద్య సహకారంతో అన్నమయ్య సంకీర్తనలతో సంగీత కచ్చేరి నిర్వహించారు. ఈ సందర్భంగా మృత్యుంజయుడు తాటిపాముల సంపాదకత్వంలో సుజనరంజని ప్రత్యేక సంచికను విడుదల చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: