కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్), వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో నిర్వహించిన "పాటకి పట్టాభిషేకం" కార్యక్రమం  ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన పాడిన ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో  ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో ఆదివారం  జూన్ 11 వ తేది 2017  సాయంత్రం 4 గం కు  మొదలైన పాటకి పట్టాభిషేకం కార్యక్రమం  రాత్రి 9 గం వరకు కొనసాగింది. పలువురు స్థానిక కళాకారులు పాడిన మధురగీతాలతో ప్రాంగణం పరవశమైపోయింది.
 
స్థానిక అప్పకడై చెట్టినాడు రెస్టారంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, స్థానిక గాయకులు పాడిన మధుర గీతాలు మరి ఇంకెన్నో విశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, ఘంటసాల, బాలు సినీ మధుర గీతాలతో పాటకి పట్టాభిషేకం జరుపుకొందాము అని టాగ్స్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 250 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా మూర్తిదేవి అవార్డు గ్రహీత, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు  ముఖ్య అతిధి గా విచ్చేసి చక్కని ప్రదర్శన చేసిన రామకృష్ణ యనమండ్ర, లలిత నేమన తో పాటు స్థానిక కళాకారులను అభినందించారు. వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజుతో తన 40 ఏండ్ల అనుబంధాన్ని  ఆహుతులకు ఆయన వివరించారు. దివ్యాంగులు, అనాధల కు వేగేశ్న ఫౌండేషన్ ద్వారా  వంశీ రామరాజు చేస్తున్న సేవలను తాను హైదరాబాద్ లో ఉండి చూసిన విధం వివరించడమే కాకుండా, ఇటువంటి సేవా కార్యక్రమాలకు సహాయపడడం ద్వారా శాక్రమెంటో   స్థానిక తెలుగు కుటుంబాలు మరింత ఉన్నత స్థాయికి చేరతాయని నొక్కి చెప్పారు. టాగ్స్ కార్యవర్గం సభ్యులు ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు.
 
ప్రియమైన అతిధి గా విచ్చేసిన వేగేశ్న ఫౌండేషన్ వంశీ రామరాజు గారు హైదరాబాద్ లో ఉన్న తమ ఆశ్రమంలో స్వర్గీయ ఘంటసాల గారికి గుడి కట్టించడం జరిగిందనీ, అక్కడ నిత్య పూజలు జరుగుతున్నాయి అనీ, ఈ "పాటకి పట్టాభిషేకం" కార్యక్రమం  ద్వారా   వేగేశ్న ఫౌండేషన్ కార్యక్రమాలను శాక్రమెంటో  స్థానిక తెలుగు కుటుంబాలవారికి తెలియజేయడం ఆనందకరంగా ఉందని చెప్పారు. "పాటకి పట్టాభిషేకం" బృందం  అమెరికాలో పర్యటించడానికి సహాయ సహకారాలు అందజేసిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు గారికి, తెలంగాణా టూరిజం శాఖ కు వంశీ రామరాజు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండు నెలల పాటు అమెరికా లో పర్యటిస్తూ  పలు పట్టణాలతో పాటు   శాక్రమెంటో లో  "పాటకి పట్టాభిషేకం" జరుపుకోవడం ఆనందగా ఉంది అని ఆయన చెప్పారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు వంశీ రామరాజు గారి కి  వేదిక పై ఘనం గా సన్మానం గావించారు.
 
ముందుగా విశ్రుత్ నాగం, శ్రీదేవి మాగంటి ఆలపించిన ప్రార్ధనా గీతాలతో కార్యక్రమం ఆరంభం అయ్యింది. అనంతరం టాగ్స్ అధ్యక్షులు మనోహర్ మందడి "శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన" లను సభకు పరిచయం చేశారు.  శ్రీ రామకృష్ణ యనమండ్ర, శ్రీమతి లలిత నేమన పలు  "ఘంటసాల, బాలు" సినీ మధుర గీతాలతో అలరించారు. పిదప పలువు స్థానిక కళాకారులు "అభినవ ఘంటసాల" రాజు  ఈడూరి, దివావాకర్ సోమంచి, శ్రీదేవి సోమంచి, రమా మణి  ఆకెళ్ళ, అబ్దుల్ షేక్, చైత్రిక బుడమగుంట, ప్రతీక బుడమగుంట (బుడమగుంట  సిస్టర్స్) ఆలపించిన గీతాలకు ఆహుతులు తప్పట్లతో అభినందించి వారిని ప్రోత్సాహించారు.
 
 టాగ్స్ చైర్మన్ వెంకట్ నాగం మాట్లాడుతూ, పద్మ శ్రీ ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారు రెండవసారి శాక్రమెంటో పర్యటనకు  రావడం మనమంతా చేసుకున్న అదృష్టమని, ఈ సందర్భంగా  జూన్ 17న "ఇనాక్ గారితో మాటా మంతి" ప్రత్యేక ముఖాముఖి  కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగిందని, ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు స్థానిక రుచి ఇండియన్ రెస్టారెంట్  కు అందరూ విచ్చేసి  ప్రొఫెసర్ కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగంతో పాటు, డా సి నారాయణరెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం,   వారి  సాహితీ ప్రయాణానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుకోవచ్చునని తెలిపారు.
 
టాగ్స్ సెక్రటరీ  మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు.   కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు : మనోహర్ మందడి, మోహన్ కాట్రగడ్డ, సందీప్ గుడుపెల్లి, శ్రీదేవి మాగంటి, కీర్తి సురం, సురేంద్రనాథ్ కొప్పారపు, శ్రీరామ్ అకిన, మమతా దాసి, నాగేశ్వరరావు దొండపాటి,నాగేంద్రనాథ్ పగడాల, శ్రీనివాస రావు యనపర్తి, ప్రసాద్ కేతిరెడ్డి,  శ్రీధర్ రెడ్డి, అశ్విన్ తిరునాహరి, మల్లిక్ సజ్జనగాండ్ల, స్వర్ణ కంభంపాటి, వాసు కుడుపూడి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిశెట్టి, అనిల్ మండవ, వెంకట్ నాగం, భాస్కర్ దాచేపల్లి, ప్రసాద్ కేటిరెడ్డి,  డా సంజయ్ యడ్లపల్లి మరియు పలువురు  టాగ్స్ కార్యకర్తలు పాల్గోన్నారు. టాగ్స్ కోశాధికారి సందీప్ గుడుపెల్లి  ఫోటోగ్రఫీ సహకారం అందించారు. ఈ సందర్భం గా టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు, వికలాంగ, అనాధ బాలబాలికల సహాయార్ధం వేగేశ్న ఫౌండేషన్ కు ఆరు వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు.  ఈ సంస్థకు  సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిల్‌లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.  "పాటకి పట్టాభిషేకం" ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream  లో లేదా www.goo.gl/o9nFna  లో చూడవచ్చునని వారు తెలిపారు.  టాగ్స్ చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని టాగ్స్ కార్యనిర్వాహక సభ్యులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: