గత ఆరు నెలల కాలంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో లిమిటెడ్‌ 1,600మంది అమెరికాలోని స్థానికులకు ఉపాధి కల్పించినట్లు వెల్లడించింది. విప్రో మొత్తం ఉద్యోగుల్లో సుమారు సగం మంది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనే ఉన్నారు. అమెరికాలోని క్లయింట్లకు సేవలందించేందుకు విప్రో వంటి సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థలు ఇంజినీర్లను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగి వీసా కార్యక్రమాన్ని సమీక్షించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం మేరకు విప్రో ఈ ప్రకటన వెలువరించింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్న విప్రో 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3వేల మంది అమెరికన్‌ స్థానికులకు ఉద్యోగాలను ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో అమెరికాలో ఆ సంఖ్య 14 వేలకు చేరుకుంది. అంతేకాకుండా తంపా, డల్లాస్‌లలో కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థను విస్తరించనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: