ఇక నుంచి విద్యార్థులు, అధ్యాపకులు తమ వెంట రక్షణగా తుపాకీలను తెచ్చుకోవడానికి అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. దుండగుల దాడులను నుంచి తమను తాము కాపాడుకునేందుకు క్యాంపస్‌లకు తుపాకీలు తెచ్చుకునేలా కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికే అర్కాన్‌సస్‌, జార్జియాతో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యార్థులు తమ వెంట తుపాకీలు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. కాగా కాలిఫోర్నియా, దక్షిణ కరోలినాతో పాటు 16 రాష్ట్రాలు తుపాకీ సంస్కృతిని రద్దు చేశాయి. తుపాకీ నిబంధన తీసుకురావడంతో కన్సాస్‌ విశ్వవిద్యాలయాల్లో పనిచేసే కొంతమంది అధ్యాపకులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ‘నేను వేరే ఉద్యోగం వెతుక్కుంటున్నాను. ఆయుధాలు వెంట తెచ్చుకునే విద్యార్థులకు నేను పాఠాలు బోధించలేను’ అని కన్సాస్‌ స్టేట్‌ యూనివర్సిటీలోని ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ ఫిలిప్‌ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: