ఇటీవల ‘మిస్‌ వరల్డ్‌ కెనెడా’ పోటీలకు ఎంపికైన కల్యాణపు శ్రావ్య తెలంగాణ బిడ్డ. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో 1996లో జన్మించిన ఈమె ఏడో తరగతి వరకు ఆదిలాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌లో చదువుకున్నారు. ఆ సమయంలో ఆమె తండ్రి రవికుమార్‌ ఇచ్చోడ మండల వ్యవసాయాధికారిగా పనిచేశారు. దాదాపు 12 ఏళ్ల కిందట ఉపాధి కోసం వీరి కుటుంబం కెనడాకు వెళ్లింది. ప్రస్తుతం శ్రావ్య కెనడాలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతోంది. ఇప్పటికే ‘మిస్‌ నార్తర్న్‌ అల్బెర్టా వరల్డ్‌-2017’ కిరీటం గెల్చుకున్న యువతి..జులై 16 నుంచి 23 వరకు జరగబోయే ‘మిస్‌ వరల్డ్‌ కెనెడా’ పోటీలకు ఎంపికయ్యారు. శ్రావ్య సాధించిన ఘనత పట్ల ఆదిలాబాద్‌లోని ఆమె మిత్రులు, పాఠశాల సిబ్బంది..ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల్లోనూ జిల్లా తరఫున ఆమెకు అభినందనలు వెల్లువెత్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: