ఆ దేశాన్ని మేము కట్టడి చేయలేము. అంతా మాపై తోసేసి పక్కకు తప్పుకుంటే ప్రయోజనం ఏమి లేదు. ఆ దేశం తప్పే చేస్తోందని అనుకుందాం. అయితే మీరు చేస్తున్నది ఏమిటో అర్థం కావడం లేదు. ఆ దేశ సరిహద్దుల్లో మీ సైన్యం విన్యాసాలు చేయడమేమిటో దాన్ని ఎలా అనుకోవాలో తెలియడం లేదు. ఎదుటివారికి  చెప్పేముందు మీరు ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారో ఆలోచించుకోండి. ఈ మాటలు అన్నది ఎవరో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ ష్వాంగ్. ఈ మాటలు అమెరికానుద్దేశించి చేసినవని అమెరికా పత్రికలు చెబుతున్నాయి.


త్తరకొరియా అంశం తెరపైకి వచ్చినప్పుడల్లా అమెరికా తమపై భారం మోపుతూ తమనే దోషులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని తెలిపింది. ఏ దేశ ప్రయోజనాలు ఆయా దేశాలకుంటాయని ఆయన అన్నారు. వాణిజ్య సంబంధాలున్నంత మాత్రాన ఆ దేశాన్ని తామే ముందుకు నడిపిస్తున్నట్లు పరిపాలన మొత్తం మా ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు చెప్పడం సరైంది కాదని ఆయన అన్నారు. అయితే అమెరికా కూడా దక్షిణకొరియాకు న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ అందించిందని మరి దాన్ని ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు. మీరు ఇస్తే రక్షణ కోసం ఇచ్చినట్టవుతుందా? అదే ప్రత్యర్థి దేశం దాన్ని సమకూర్చుకుంటే తప్పవుతుందా అని ఆయన అమెరికా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: