వంది మంది ఎన్ఆర్ఐ విద్యార్థులకు శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం(ఎస్పీఎంవీవీ) మ్యూజిక్ కోర్సు సర్టిఫికెట్లను ప్రదానం చేసింది. ఎస్పీఎంవీవీ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఆధ్వర్యంలో అమెరికాలో క్లాసికల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్‌ కోర్సులను గత సంవత్సరం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్, ప్రొఫెసర్ వి. దుర్గా భవానితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని టెక్సాస్లో ప్లానోలోని మినర్వా హోటల్లో తానా సభ్యులు నిర్వహించారు. 



సుస్వర మ్యూజిక్ అకాడమీకి చెందిన విద్యార్థులు ఆలపించిన మధురమైన గీతాలు అందిరిని ఆకట్టుకున్నాయి. తానా, ఎస్పీఎంవీవీ సహాకారంతో అందిస్తున్న కల్చరల్ డ్యాన్స్, మ్యూజిక్ కోర్సులను నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను డా. ప్రసాద్ తోటకూర వివరించారు. ఈ సందర్భంగా మ్యూజిక్ కోర్సులను విజయవంతంగా పూర్తిచేసిన 100 మంది విద్యార్థులకు ప్రొఫెసర్ భవాని సర్టిఫికేట్స్‌ను అందజేశారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు, వారి తల్లీతండ్రులను ఉద్దేశించి భవాని మాట్లాడారు. విజయవంతంగా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: