భారత దేశం ఔన్నత్యం చాటి చెప్పే విధంగా ఇక్కడి జాతీయ జెండాను ఎంతో గౌరవిస్తారు.  అయితే జాతీయ జెండా పలు సందర్భంల్లో ఎంతో మంది ఔత్సాహికులు రక రకాలుగా ప్రదర్శిస్తుంటారు.  అతి పెద్ద జాతీయ జెండా..అతి పొడవైన జాతీయ జెండా ఇలా ఎన్నో రకాలుగా చూశాం.  తాజాగా 50 అడుగుల పొడవు, 1.3మీటర్ల వెడల్పు ఉన్న ఈ త్రివర్ణ పతాకాన్ని లండన్ల ని జింఖానా గ్రౌండ్స్ లో ప్రదర్శించారు.  

ఇంగ్లండ్ దేశం లండన్ సిటీలో భారత హైకమిషన్ నిర్వహించిన 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఇండియన్ అందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ NRI ఫోరమ్(TeNF) ప్రాతినిధ్యం వహించింది.  ఈ జాతీయ జెండాను సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేయడం మరో విశేషం. నేతన్నకు మద్దతిద్దాం అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
\

ఇక తెలంగాణ రాష్ర్ట ప్రాముఖ్యత, విశిష్టత గురించి వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రవాస భారతీయులతో పాటు ఇతరులకు తెలియాలనే ఆలోచనతో.. తెలంగాణ ఎన్నారై ఫోరం తెలంగాణ ప్రముఖులు, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు, తెలంగాణ ప్రత్యేకతలతో తెలంగాణ చారిత్రక పుస్తక ప్రదర్శనతో ప్రత్యేకంగా తెలంగాణ స్టాల్ ని ఏర్పాటు చేసింది. 


దీనికి భారత్ హైకమిషనర్ వైకె.సిన్హా హాజరయ్యారు.ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ NRI ఫోరమ్(TeNF) వ్యవస్థాపక సభ్యులు గంప వేణు, అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్, అడ్వయిజరీ చైర్మన్ ప్రమోద్, వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, ప్రధాన కార్యదర్శులు నగేష్, సుధాకర్ తోపాటు ఇతర సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: