వివిధ దేశాల ప్రభుత్వాలలో కానీ కీలకమైన రంగాలలో కానీ  మన భారతీయులు ఎంతో మంది ఎన్నో ఉన్నతమైన స్థానాల్లో  ఉన్నారు..ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికాలో మనవాళ్ళ హవా ఎప్పుడు కొనసాగుతూనే ఉంది.ఐతే ఇపుడు అమెరికాలాంటి  అగ్రరాజ్యంలో రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా మన ఇండియాలో రిజర్వు బ్యాంక్ చైర్మన గా చేసిన రఘురామ్ రాజన్ పేరు వినిపిస్తోంది.

 

అంతర్జాతీయ ఆర్థిక విషయాల పత్రిక ‘బారన్స్‌’ ఆ పదవికి రాజన్‌ ముమ్మాటికి సరైన అభ్యర్థి అంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదవికి రాజన్‌ అత్యంత సరైన అభ్యర్థి అని పేర్కొంది. చికాగో యూనివర్సిటీ బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్ లో ఆర్థిక శాస్త్ర ఆచార్యుడిగా పని చేస్తున్న రాజన్‌ ఆర్‌బిఐ గవర్నర్‌గా భారత ఆర్థిక వ్యవస్థను ఎలా గాడిలో పెట్టారో ఈ పత్రిక తెలిపింది..ఫెడ్‌ రిజర్వ్‌ ప్రస్తుత చైర్‌పర్సన్‌ జానెట్‌ ఎలెన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో రిటైర్‌ అవుతారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ త్వరలోనే కొత్త చైర్మన్‌ను ప్రకటించబోతున్నారు.

 

 కొత్త చైర్మన్ కోసం ఇప్పటికే ట్రంప్ ముందుకు కొన్ని పేర్లతో కూడిన లిస్టు వెళ్ళింది అని కానీ దానిలో రాజన్ పేరు లేదు అని తెలుస్తోంది..ఈ సమయంలో  బారన్స్‌ పత్రిక రాజన్‌ పేరును తెరపైకి తీసుకురావడం విశేషం. రాజన్ మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ కోసం చేసిన కృషి మరిచిపోలేనిది..2008 ఆర్థిక సంక్షోభాన్ని రాజన్‌ మూడేళ్ల ముందే గుర్తించి హెచ్చరించిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది..ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ పదవికి రాజన్‌కు ఉన్న అర్హతలు మరెవ్వరికీ లేవని ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉందని తెలిపింది.నిజంగా రాజన్ అమెరికా రిజర్వు బ్యాంక్ చైర్మన్ గా నియమితులు అయితే భారతదేశానికి ఇది మరొక గర్వకారణమైన వార్తే.


మరింత సమాచారం తెలుసుకోండి: