తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ నటించిన కాటమరాయుడు చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన ఆప్త మిత్రుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అజ్ఞతవాసి ’ (వర్కింగ్ టైటిల్)  లో నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో పవన్ కళ్యాన్ ఓ సాఫ్ట్ వెర్ ఇంజనీర్ లా కనిపించబోతున్నాడని టాక్.  ఈ మద్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన లీకేజ్ లు చాలా వరకు బయటకు వస్తున్న నేపథ్యంలో   ‘అజ్ఞతవాసి ’కి సంబంధించి ఏ ఒక్కటీ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్ర యూనిట్. 
Related image
ఈ రోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమా కు సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ చేశారు.   ప్రస్తుతం యూరప్‌లో చిత్రీకరణ జరుగుతోంది. పాటలు, కొన్ని సన్నివేశాలు అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌, అను ఇమ్మాన్యుయేల్‌తో త్రివిక్రమ్‌ తీసిన సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టూ చేస్తూ ' గుడ్‌ కంపెనీ ..గుడ్‌ వర్క్‌' అని పేర్కొంది అను ఇమ్మాన్యుయేల్‌. కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.
Image result for pawan kalyan agnathavasi
త్రివిక్రమ్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని  ‘బయటకొచ్చి చూస్తే టైమేమో త్రీవో క్లాక్’ పూర్తి పాట రిలీజ్ చేశారు.  ఈ పాటను శ్రీమణి రాశాడు. దీంతో పాటు ఈ సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. హారిక, హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వర్ స్టార్ పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 
Related image
కాగా ఈ ఆడియో సాంగ్‌ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సాధించి పవన్ స్టామినాను మరోసారి గుర్తు చేసింది. తొలి అరగంటలో లక్ష వ్యూస్ సాధించిన ఈ సాంగ్... ఐదు లక్షలకు చేరువైంది. ఈమూవీ కోలీవుడ్ సంగీత దర్శకుడు అనురుధ్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాను.  సంక్రాంతి సందర్భం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: