కోటి ఆశలతో..తానూ ఎంచుకున్న మార్గంలో నడవాలని..ఎంతో ఉన్నత స్థితిలో తన కుటుంభాన్ని నిలపాలని అనుకున్న ఒక ఎన్నారై కలలు కలలు గానే మిగిలిపోయాయి..కొండంత ఆశతో అమెరికా వెళ్లి స్థిరపడాలని చుసిన అతని కోరికలు ఆవిరి అయ్యాయి..కానీ విధి రాతని ఎవరు మార్చలేరు..తన భార్యా..పిల్లలని వదిలి అనంత లోకాలకి వెళ్ళిపోయారు అమెరికాలో ఉంటున్న నల్లపనేని.మాల్యాద్రి . వివరాలలోకి వెళ్తే

 

నల్లపనేని.మాల్యాద్రి (33) విజయవాడకి చెందిన వ్యక్తి..తన భార్య శిరీష తో పాటు..అమెరికాలోని మిన్నెసోటాలో నివాసముంటున్నాడు. వీరికి 15 నెలల వయసున్న ఓ కొడుకు ఉన్నాడు. ఈ నెల నవంబర్ 1న అర్థరాత్రి మాల్యాద్రికి గుండెపోటుకు వచ్చింది. గమనించిన భార్య అతడిని హాస్పిటల్‌కు తరలించింది. అప్పటికే అతడు కోమాలోకి వెళ్లాడు. శరీరంలోని అవయవాల స్పందన ఆగిపోయింది.కొన్ని రోజులు వెంటిలేటర్ మీద వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. ఎన్నిరోజులయినా ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మెరుగుదల ఉండబోదని డాక్టర్లు వెల్లడించారు

 

డాక్టర్స్ సూచనతో తన భర్త యొక్క లైఫ్ సపోర్ట్ ను తొలగించేదుకు అంగీకరించింది..మల్యాద్రి కన్నుమూశాడు కొండంత అండగా ఉండే భర్త తనని విడిచి వెళ్లిపోవడంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది..మల్యాద్రి కన్నుమూశాడు. ఈ పరిణామాలతో మల్యాద్రి కుటుంబం, భార్య తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త మృతదేహాన్ని స్వస్థలమయిన విజయవాడకు తరలించడానికి కూడా తన దగ్గర డబ్బులు లేకపోవడంతో మరింత మానసిక వేదనకి ఆమె గురవుతోంది అని ఎవరైనా ఆదుకోవాలని ఆమె కోరుతోంది. ఊరు కాని ఊరులో తన భార్తకుడా తోడు లేకుండా 15నెలల కొడుకుతో కలిసి వారి బాధ అంతా ఇంతా కాదు. నిస్సహాయ స్థితిలో ఉన్న తమను ఆదుకోవాలని భార్య శిరీష కోరుతోంది. దాతల ఆపన్న హస్తం కోసం.. తన 15నెలల కొడుకుతో కలిసి ఎదురుచూస్తోంది. 

 

ఆర్ధిక సాయం చేయాలనుకునే వారు https://www.gofundme.com/helpmalya-syoungfamily

 


మరింత సమాచారం తెలుసుకోండి: