కువైట్ లో ఉంటున్న తెలుగు వారు అందరు కలిసి అనేక సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు..అక్కడ సుమారు 40 తెలుగు  సంఘాలు ఏర్పాడాయి. అయితే ఇప్పుడు ఈ సంఘాలు వారు అందరు కలిసి ఒకే ఐక్య వేదికాగా నిలిచారు.ఈ సంఘాల అధ్యకులు..సభ్యులు అందరు కలిసి బుదవారం భారత రాయబారి కార్యాలయం అధికారిని కలిశారు. అయితే ఎవరికీ వారుగా విడిపోయి కాకుండా అందరు కలిసి ఒకే వేదికగా ఏర్పడితే మరిన్ని కార్యక్రమాలు చెయచ్చు అనే ఉద్దేశ్యంతో  ఒకే ఐక్య వేదికగా ఏర్పడ్డారు.

 

ఈ సంఘం కన్వినర్ మాట్లాడుతూ కువైట్‌లో ఉన్న తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి అండగా తామున్నామనే భరోసాను కల్పించి, సహాయసహకారాలందించడమే లక్ష్యంగా అన్ని సంఘాలు కలిసి ఒక్కటిగా ఏర్పడాము అని ఎవరికీ సాయం అందించాలి అన్నా సరే ముందు ఉంటాము అని తెలిపారు. కన్వీనర్ సుధాకరరావు అన్ని సంఘాల అధ్యక్షులను డీసీఎమ్ రాజగోపాల్ సింగ్‌కు పరిచయం చేసి ఆయా సంఘాలు చెస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను గురించి వివరించారు.

 

 కువైట్ లో ఉండే తెలుగు లలితా కళా సమితి అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ బాబు ఈ ఐక్యవేదిక భవిష్యత్ ప్రణాళికలను భారత రాయబారి కార్యాలయ అధికారులకు వివరించారు. అలాగే రాయలసీమ గల్ఫ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ  ప్రస్తుతం తెలుగువారు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను రాయభారికి తెలిపి పరిష్కారం కోసం సాయం అడిగారు.. ఎన్నో కష్ట నష్టాలని పడుతున్న వారిని ఆదుకుంటాం అని అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వం తరుపున మీ సహకారం కావాలని కోరారు. మాలేపాటి సురేష్ బాబు, మన కడప సేవాసమితి అధ్యక్షులు సుబ్బు, అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు ప్రభాకర్ యాదవ్ తదితర ప్రముఖులు..డీసీఎమ్ రాజగోపాల్ సింగ్‌ను సన్మానించారు. 

 


మరింత సమాచారం తెలుసుకోండి: