అమెరికా లాంటి దేశంలో చదువుకోవాలని..అక్కడ ఉద్యోగం చేయాలని ఎంతో మంది విద్యార్ధులు..పోటీ పడుతూ ఉంటారు..అలాగే అక్కడ ఉద్యోగం చేస్తున్న అనేక మంది పొరుగు దేశం వాళ్ళు అమెరికా పౌరసత్వం కావాలని ప్రత్నిస్తూ ఉంటారు..ఎంతో కాలంగా కొన్ని లక్షల మంది వేచి చూస్తున్న అమెరికా పౌరసత్వం సంభందించి ఈరోజు యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఓ నివేదికను విడుదల చేసింది.ఈ నివేదిక ప్రకారం 2015 అక్టోబరు 1 నుంచి 2016 సెప్టెంబరు 30 వరకు అమెరికా ప్రభుత్వం మొత్తం 7.53 లక్షల మంది వ్యక్తులకు అమెరికా పౌరసత్వాన్ని కల్పించింది. వీరిలో దాదాపు 46,100 మంది భారతీయులు ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది.

 Image result for us citizenship

 

సుమారుగా అమెరికా విడుదల చేసిన పౌరసత్వాలలో సుమారు ఆరు శాతం భారతీయులకు దక్కాయని డీహెచ్‌ఎస్‌ పేర్కొంది. అత్యధిక సంఖ్యలో అమెరికా పౌరసత్వాన్ని అందుకున్న వారిలో మెక్సికన్లు అగ్రస్థానంలో నిలిచారు. 2015తో పోల్చుకుంటే గతేడాదిలో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 24 శాతం పెరిగినట్లు డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. 2015లో శాశ్వత పౌరసత్వం కోసం  7.83 లక్షల దరఖాస్తులు రాగా, 2016లో 9.72 లక్షల దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా గ్రీన్‌కార్డు ఉన్న వారికి మాత్రమే అమెరికా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది.

 

అమెరికా కల్పించిన ఈ పౌరసత్వం వలన అక్కడ ఉండే వారికి కొన్ని హక్కులు లభిస్తాయి.అమెరికా ఎన్నికల్లో ఓటు వేసే హక్కు నుంచీ అక్కడ ఉగ్యోగాలలో ప్రాధాన్యత కూడా దొరుకుతుంది..ఈ విషయాన్ని ఏసియన్‌ అడ్వాన్సింగ్‌ జస్టిస్‌ అధ్యక్షుడు జాన్‌ సి యాంగ్‌ తెలిపారు.ఏది ఏమైనా ఎప్పటినుంచొ అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్న ఎంతో మంది భారతీయులు తమ అదృష్టాన్ని పరీక్షించు కుంటున్నారు.

Image result for us citizenship

మరింత సమాచారం తెలుసుకోండి: