ఒకప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే ఎగిరి గంతేసే భారతీయులు ఇప్పుడు అమెరికా అమెరికా వెళ్ళాలంటేనే భయపడిపోతున్నారు..మంచి ఉద్యోగం..చక్కని చదువు..జీవితంలో వెనక్కి కూడా చూసుకోవలసిన అవసరం లేకుండా సెట్ అయిపోయే అవకాశాలు..ఇలాంటి ప్రయోజనాలు ఎవరు కాదంటారు చెప్పండి..మరి ఎందుకు వెళ్ళడానికి భయపడుతున్నారు అని వారిని అడిగితే..డబ్బు..మంచి ఉద్యోగం..ఇవన్నీ అనుభవించడానికి ముందు మేము ఉండాలిగా అంటూ బదులు ఇస్తున్నారు.అవును నిజమే ఈ మధ్యకాలంలో జరిగిన జాత్యహంకార దాడులు..భారతీయులని అలోచిప చేస్తున్నాయి..సరిగ్గా చెప్పాలి అంటే భయపెడుతున్నాయి..అందుకే అమెరికాకి వెళ్ళాలి అంటే అడుగు వేయడానికి అనేకరకాలుగా ఆలోచిస్తున్నారు..దీనికి ఈ మధ్య జరిగిన శ్రీనివాస్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య మరింత భయాన్ని పెంచేసింది..

 Related image

ఈ రకమైన పరిస్థితులు అమెరికా కొత్త అధ్యక్షుడు వచ్చిన తరువాత విపరీతంగా పెరిగిపోయాయి..వలస దారులని ఆపడానికి ముఖ్యంగా మన భారతీయులని కట్టడి చేయడానికి ట్రంప్ వీసాల విషయం లో తెచ్చిన భారీ మార్పులు అమెరికన్స్ ని మరింతగా రెచ్చగోట్టాయి.దాంతో ఈ జాత్యహంకార దాడులు ఎక్కువ అయ్యాయి..ఈ క్రమంలో భారతీయులకు... ప్రత్యేకించి విద్య ఉపాధి వెతుక్కుంటూ అమెరికాకు వెళ్లానుకునే యువకులు ఆ దేశం వైపు కన్నెత్తి చూసేందుకు జడిసిపోతున్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాకు వెళ్ళినటువంటి భారతీయుల గణాంకాలను బయటకు తీస్తే ఈ నిజం వెలుగులోకి వచ్చింది. అయితే తమ దేశానికి వస్తున్న భారతీయుల సంఖ్య తగ్గడానికి గల కారణాలపై తమదైన శైలి వాదనలు వినిపిస్తున్నఅమెరికా మోదీ సర్కారు అములోకి తెచ్చిన నోట్ల రద్దు - జీఎస్టీలే కారణమంటూ ఓ కొత్త వాదనను తెరమీదకి తెస్తున్నాయి  

 Related image

 ఈ ఏడాది ప్రథమార్థం నుంచి అమెరికాకు వెళ్లిన భారతీయుల సంఖ్య 13 శాతం మేర తగ్గిపోయింది. ఈ లెక్కలు భారతీయ సంస్థలు వేసినవి కావు. అమెరికా జాతీయ రవాణా పర్యాటక శాఖ కార్యాలయం అందించిన గణాంకాలు. ఈ తరుగుదల జనవరి నుంచి మొదలైనా... మార్చి తర్వాత మరింతగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఈ తరుగుదల జనవరి నుంచి మార్చి దాకా తక్కువగానే కనిపించినా... ఏప్రిల్ నుంచి జూన్ దాకా ఉన్న త్రైమాసికంలో ఏకంగా 18.3కు పడిపోయింది. మొత్తంగా ఈ ఆరు నెలల కాలంలో అమెరికా విజిట్ కు వెళుతున్న భారతీయులు 13 శాతం మేర తగ్గిపోయారు...ట్రంప్ సర్కారు వ్యవహరిస్తున్న తీరు కారణంగానే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని మాత్రం చెప్పక తప్పదు.ఏది ఏమైనా సరే భారతీయులు అమెరికా కాకుండా మరొక దేశం వైపు చూస్తున్నారు అనే విషయం వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: