రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకు బ్రతికే ఇక్కడి వాళ్ళు ఎదో సంపాదించుకోవాలనే ఆశతో సౌదీ వెళ్లి అక్కడ ఎన్నోకష్టాలు అనుభవిస్తూ ఉంటారు..కొంతమంది ఏజెంట్ల చేతిలో మోసపోతే..మరి కొంతమంది అక్కడ పని చేస్తున్న యజమానుల దగ్గర నుంచీ అవమానాలు..లైంగిక వేదింపుల పాలవుతూ ఉంటారు..అయితే కొంతమంది మాత్రమే అక్కడ పరిస్థితులని తట్టుకుని నిలబడగలిగేది..అయితే ఇప్పుడు సౌదీ లో ఉన్న అనేకమంది వలస దారులకి ఆ దేశం పెద్ద షాక్ ఇచ్చింది అనే చెప్పాలి..ఇప్పుడు అక్కడ ఆంక్షలు వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.

 Image result for saudi president

సౌదీ లో ఉన్న ఆంక్షలలో భాగంగా సౌదీ అరేబియాలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈతనిఖీల్లో ప ట్టుబడిన తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన దాదాపు 2వేల మంది కార్మికులు తిరుగుపయన మయ్యారు. ప్రధానంగా అకామ లేకుండా అక్కడే ఉంటూ పనులు చేసుకుంటున్న కార్మి కులకు తిప్పలు తప్పడం లేదు.ఈనిబంధనలు అక్టోబ రు నుండి జనవరి వరకు కొనసాగుతాయి. ఈమూడు నెలల్లో పట్టుబడిన కార్మి కులను ఇంటికి పంపిస్తున్నా రు. దాదాపు రెండు లక్షల మంది కార్మికులు అక్రమంగా ఉంటున్నారని సౌదీ ప్రభుత్వం వెల్లడించింది...
Image result for so many saudi migrated indians suffering for new rules

సౌదీలో తెలంగాణలోని కరీంనగర్‌, నిజామాబాద్‌ ఉ మ్మడి జిల్లాలకు చెందిన వేలాది కార్మికులు భవన ని ర్మాణ రంగంలో ఉన్నారు..కొందరు కాంట్రాక్టర్లు అకామ ఇవ్వకుండా కార్మికులను తిప్పుకుంటారు. ఇటు వంటి కార్మికులకు ఇబ్బందులు తప్పడంలేదు...వర్క్‌ పర్మిట్‌, రెసి డెంట్‌ పర్మిట్‌ లేకుండా, దేశసరిహద్దులు దాటి సౌది వెళ్లిన కార్మికులు కష్టాల్లో పడినట్లే.అయితే..సౌదీ అరేబియాలోని రియాద్‌, దమ్మం, జిద్దాలో పోలీ సులు తనిఖీలు ముమ్మరం చేశారు.

 

 Image result for saudi indians

ఇందులో భాగంగా కార్మికులు నివసించే గదులపై దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు.కార్మికుల వద్ద విసా..పాస్‌పోర్టు.. గుర్తింపు కార్డులు.. అకామలు పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే వదిలివేస్తున్నారు. ఈ పత్రాల లో ఏవి లేకున్నా వెంటనే పట్టుకొని అరెస్ట్‌ చేస్తున్నారు. అరెస్టు అయిన కార్మికులని...20 రోజులు జైల్లో పెట్టి ఆతర్వాత టికెట్‌ ఇచ్చి పంపించేస్తున్నారు. “అకామ” లేకండా అక్కడే ఉంటూ ఉ పాధి పొందుతున్న కార్మికులను పట్టు కొని అవుట్‌ పాస్‌పోర్టు ఇచ్చి పంపిం చే స్తున్నారు.తెలంగాణలోని వేలాదిమంది కార్మి కులు సౌదీలో ఉంటూ పనులు చేస్తున్నారు.నిభందనలు కటినరతం చేయడం తో అక్కడ వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: