అమెరికా రోజుకో ప్రకటన చేస్తూ వలసదారుల విషయంలో చెడుగుడు ఆడుతూ వస్తోంది..ఎంతో మంది అనేక ఆశలు కోరికలతో ఎంతో అమెరికాలో స్థిరపడాలని వెళ్తూ ఉంటారు..అయితే వలస వచ్చే వాళ్ళవలన అమెరికా పౌరులు నిరుద్యోగులుగా మారుతున్నారు వారి అవకాశాలని వేరే దేశం వాళ్ళు దోచుకుంటున్నారు అనేది అమెరికా పౌరుల మాటలు..అదే విషయంలో ట్రంప్ ఎన్నికల నాడు ఇచ్చిన వాగ్దానం కోసం ఇప్పుడు వీసాలపై ఆంక్షలు పెట్టి ఒక్కొక్కరిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగానే హెచ్ 1 – బీ వీసా పొందటానికి విధానాలని మరింత కఠినతరం చేస్తున్నాడు.  వివరాలలోకి వెళ్తే

 h1 b visa కోసం చిత్ర ఫలితం

అమెరికాలోని కంపెనీల్లో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన హెచ్‌-1బీ వీసా జారీ విధానాన్ని మరింత కఠినతరం చేసేందుకు అమెరికా యత్నిస్తోంది..దీనికోసం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 2011లో  చేసిన ప్రతిపాదనలను హోంల్యాండ్ సెక్యూరిటీ మళ్ళీ తిరిగి సవరిస్తున్నారు..

ఈ సవరణల ప్రకారం..

 h1 b visa tuff కోసం చిత్ర ఫలితం

హెచ్‌-1బీ కోసం దరఖాస్తు చేసుకునే పిటిషన్‌దారులు ముందుగా హెచ్‌-1బీ క్యాప్‌ లాటరీ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలి. క్యాప్‌ నంబర్లు వచ్చిన తర్వాత.. వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నంబర్లను ఇవ్వడంలో ప్రాధాన్యత పద్ధతిని పాటించాలని హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ ప్రతిపాదిస్తోంది. దీన్ని బట్టి ఎక్కువ నైపుణ్యాలు కలిగిన వారికి, ఎక్కువ జీతం వచ్చే వారికి ఈ క్యాప్‌ నంబర్లలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 


అంతేకాదు..హెచ్‌-1బీ ఉద్యోగుల వేతనాల్లోనూ మార్పులు చేసే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ సంస్థ ఫ్రాగోమెన్ పేర్కొంది. ఇప్పటికే హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయకుండా ఉండేలా నిబంధనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మళ్లీ కొత్తగా ఈ క్యాప్ లాటరీ రిజిస్ట్రేషన్ వల్ల హెచ్‌-1బీ వీసా జారీ మరింత కఠినతరం అయ్యే అవకాశం ఉంది.అయితే ఈ జీతాలలో చేసే మార్పులు ఎలా ఉంటాయి..దానివల్ల వలసదారు ఎలా స్పందిస్తారు అనేది త్వరలోనే తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: