నూతన సంవత్సరం కానుకగా సంస్థలు ఉద్యోగులకి బోనస్ ప్రకటిస్తాయి..లేదంటే గిఫ్ట్ లు అందచేస్తాయి..అయితే గల్ఫ్ దేశాలు మాత్రం విదేశీ ఉద్యోగులకి వ్యాట్ కానుకగా ఇచ్చాయి..ఇప్పటికే గల్ఫ్ దేశాలలో ఉంటున్న అనేక మంది విదేశీ ఉద్యోగులు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటే.. గల్ఫ్ తీసుకున్న వ్యాట్ నిర్ణయం వారి మీద మరింత ప్రభావం చూపుతోంది..

 Related image

కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం నుంచి గల్ఫ్ దేశంలో వ్యాట్ అమలు కానుంది..ఇప్పటి వరకు ఎలాంటి పన్ను పోటు లేకుండా హాయిగా ఉన్న గల్ఫ్‌ వాసులు ఇకపై వ్యాట్‌ చెల్లించాల్సిందే. ఈ పన్నుతో లక్షలాది మంది విదేశీ ఉద్యోగులు, కార్మికుల మీద తీవ్రమైన ప్రభావం చూపనుంది..ముఖ్యంగా భారతీయులపై ఈ ప్రభావం పడనుంది ఎందుకంటే గల్ఫ్ లో ఎక్కువగా ఉన్న విదేశీ ఉద్యోగులు భారతీయులే..ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భారీగా పతనమవడంతో గల్ఫ్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

 

ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని రాబట్టుకోవాలనే ప్రయత్నంలో గల్ఫ్‌లోని రెండు పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యాట్‌ను ప్రవేశపెట్టాయి..దీనికితోడు యూఏఈలో భారతీయులను  తగ్గించడానికి ఉద్దేశించిన “విభిన్న సంస్కృతి.. నైపుణ్య కార్మికుల ఎంపిక”  అనే రెండు కీలక విధానాలు దుబాయిలో ప్రవాస భారతీయులపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. సౌదీ అరేబియా కూడా విదేశీయులకు ఉద్యోగాలు కల్పించిన ప్రతి సంస్థ ఒక్కో విదేశీ ఉద్యోగిపై నెలకు 300 రియాళ్ల పన్ను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.దాంతో ఇప్పుడు అదనంగా మరొక  300 రియాళ్ళు పన్ను చెల్లించాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: