అమెరికా ఎప్పటికప్పుడు వలసదారులకి కళ్ళెం వేస్తూనే వస్తోంది...ఇప్పుడు అమెరికాలో ఉన్న “బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌” పాలసీ కోసం ట్రంప్ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో భారతీయులు భారీ మొత్తంగా వెనక్కి తిరిగిరావాల్సి వస్తోంది..హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదనలతో.. హెచ్‌-1బీ వీసాలు కఠినతరం కావడం, గ్రీన్‌ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది.

 Image result for buy american hire american h1b

అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వలన అధికశాతం ఉద్యోగులలో ఐటీ రంగం వారిపై తీవ్రమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుస్తోంది..ఇప్పటికే అక్కడ ఉంటున్న ఎన్నారైల్లో ఎక్కువ శాతం భారతీయులే టార్గెట్ గా ఈ పరిణామాలు జరగడం అమెరికా వచ్చి స్థిరపడాలి అనుకున్న ఇండియన్స్ లో తీవ్రమైన కలవరం మొదలవుతోంది. ఇదిలా ఉంటే భారతీయ వర్కర్లకు హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు..శాశ్వత సభ్యత్వం కోసం ఎన్నారైలు పొందే  గ్రీన్‌కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో పడుతున్నట్టు తెలిసింది.

 Image result for 75000 indians come back india for america h1 b visa

ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్‌ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్‌-1బీ వీసాలకు మరో మూడేళ్ళ పొడిగింపును ట్రంప్‌ కార్యాలయం చేపడుతోందట..కానీ డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనలతో హెచ్‌-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది..అయితే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సుమారు 50వేల నుంచి 75 వేల వరకు భారతీయ హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని తెలుస్తోంది..మరి భరత ఐటీ రంగం నుపుణులు అక్కడ ఈ పరిస్థితిని ఎదుర్కుంటే..సంభందిత కంపెనీలు ఎటువంటి వీరా సంభందిత సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతునే  ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: