పరాయి దేశంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు అని అనేక మంది భారతీయ యువతీ యువకులకి ఎన్నో అవమానాలు మరెన్నో లెంగిక వేధింపులు జరుగుతూనే ఉంటాయి..ఎంతో మంది ఉపాధికోసం ముక్కు మొహం తెలియని వ్యక్తులని నమ్మి విదేశాలకి వెళ్తూ ఉంటారు..తీరా అక్కడకి వెళ్ళాక చుస్తే వారిని కొట్టడం, వేధింపులకి గురిచేయడం జరుగుతూ ఉంటుంది..ఇలాంటి ఎన్ని ఉదంతాలు జరిగినా సరే ఎవరో ఒకరు మోసపోతూనే ఉంటారు.

 Image result for kenya police

తాజాగా ముగ్గురు భారతీయ యువతులతో పాటుగా  ఏడుగురు  నేపాలీ యువతులుకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది..ఉపాధి కోసం కెన్యా లోని మొంబాసా వెళ్ళిన యువతురు ఆ నగరంలో మోసపోయారు. వారి పాస్‌పోర్టులు..మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని నగరంలోని ఓ ఇంట్లో భందించి నరకం చూపించారు..భారత హైకమిషన్‌ అధికారులు ఈ విషయంలో స్పందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్థానిక కెన్యా పోలీసుల సహకారంతో వారిని భారత ప్రభుత్వం విడిపించింది..

 Related image

వారిని విడిపించడంలో ఎంతో శ్రద్ధ కనబరిచి ఎన్నో ప్రయత్నాలు చేసిన కెన్యాలో ఉండే భారత హై కమిషన్ అధికారిణి సుచిత్రా , కరణ్‌ యాదవ్‌లను విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ అభినందించారు. కెన్యా పోలీసుల సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన ఏజెంట్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి అని పంజాబ్ ప్రభుత్వానికి సుష్మా స్వరాజ్ ఆదేశాలు పంపారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: