భారతీయులకి ఎంతో మేధాశక్తి కలవారు..విదేశాలలో భారతీయులు ఎన్నో దిగ్గజ కంపనీలలో..కీలకమైన పదవులు పోషిస్తున్నారు..పేరు మోసిన ఐటీ కంపెనీ లు అన్నీ కూడా భారతీయులకి రెడ్ కార్పెట్ పరుస్తుంటాయి..అమెరికా లో మేయర్లుగా..సలహాదారులుగా..ఎన్నో కీలక శాఖలలో భారత సంతతి వ్యక్తులు ఉండటం ఎంతో గోప్ప విషయం.అయితే తాజాగా ట్రంప్ క్యాబినెట్లోకి భారత సంతతి మహిళ ఎంతో కీలకమైన భాద్యతలని స్వీకరించింది..వివరాలలోకి వెళ్తే

 Image result for maneesha sing us govt

భారత సంతతికి చెందిన ప్రముఖ అమెరికా న్యాయవాది మనీషా సింగ్  ఇప్పుడు ట్రంప్ క్యాబినెట్ లో సహాయమంత్రిగా నియమింపబడ్డారు..45 ఏళ్ల వయసున్న మనీషా సింగ్..అమెరికా విదేశాంగ శాఖలోని ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ శనివారం ఆమె చేత ప్రమాణం చేయించారు.

 Related image

అయితే ఈ కీలకమిమైన ఈ పదవిలో కొనసాగనున్న తొలి మహిళగా ఆమె ఆరుదైన గౌరవం దక్కించుకున్నారు...మనీషా సింగ్ ఉత్తరప్రదేశ్‌లో పుట్టారు.. కొత్త బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అమెరికా ఆర్థికపరమైన దౌత్యవ్యవహారాలకు ఆమె ఇన్‌చార్జిగా ఉంటారని అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: