అమెరికాకి మైనర్లుగా వలస వచ్చి అక్కడే స్థిరపడి పోయిన వారిని ఆదుకుంటాం అని తెలిపాడు అమెరికా అధినేత ట్రంప్ అయితే ట్రంప్ వ్యాఖ్యలతో సిటిజన్ షిప్ కోసం ఎదురుచూస్తున్న వారికి ట్రంప్ వ్యాఖ్యలు ఉపసమనం కలిగించాయి..ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయిన తరువాత వలసదారులు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు భారతీయ సాఫ్ట్వేర్ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావం చూపింది..

 Image result for trump immigration policy

ఇదిలా ఉంటే అమెరికాలో నివస్తిస్తు పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారికి ట్రంప్ తీపి కబురు చెప్పారు వలస వచ్చి స్రమిస్తున్న భారతీయులు భాదపదవలసిన అవసరం లేదని తెలిపారు..బుధవారం ఈ ప్రకటన చేశారు ట్రంప్..అంతేకాదు వారికి తగిన ప్రోశ్చాహం అందిస్తాం అని తెలిపారు..అమెరికాలో ప్రస్తుతం సుమా 6.90 లక్షల వలసదారులున్నారని ఇందులో ఎక్కువ మంది భారతీయులే అని తెలిపారు అమెరికాలో తల్లిదండ్రులు ఉద్యోగం కోసం వచ్చిన సమయంలో మైనర్లుగా అమెరికాకు వచ్చిన వారు అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నారు.

 Image result for trump immigration policy

ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అమెరికా పౌరసత్వం కోసం ఎదురు చూస్తున్నవారిలో ఆశలు రేకెత్తాయి...ఇక్కడ ఉన్న చిన్న మెలిక ఏమిటంటే పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ఆరు లక్షల మందికి పౌరసత్వం ఇస్తారా, ఇంకా మరేదైనా నిబంధనలను ముందుకు తీసుకొస్తారా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: