పాకిస్థాన్ ఎప్పటికప్పుడు భారత్ పై విషయం కక్కుతూనే ఉంది..ప్రపంచ దేశాలకి తాము ఎంతో మంచి వారం అని పిల్లి పాలు తాగే చందంలా చెప్పుకునే పాకిస్థాన్..భారత్ మీద ఎప్పుడు ఒంటి కాలిపై నడుస్తుంది..ఈ విషయం అన్ని దేశాలకి తెలిసిందే ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించే పాకిస్థాన్..ఎప్పటికి మారుతుందో..అసలు మారుతుందా లేదా అనేది సందేహమే..అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఒక్కొక్కటిగా పాకిస్థాన్ ని పక్కన పెట్టేస్తున్నాయి..

 Image result for kulbhushan jadhav

పాకిస్థాన్ లో గూఢచర్య ఆరోపణలపై అరెస్టయి మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత నౌకాదళ మాజీ అధికారిపై  పాక్ ప్రభుత్వం మరొక కేసుని పెట్టి తమ దుర్భుద్దిని చాటుకుంది..ఉగ్రవాదం..విద్రోహ చర్యలు అనేటువంటి అభియోగాలతో ఈ కేసుపై త్వరలోనే విచారణ ప్రారంభం కానున్నట్లుగా అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి...అయితే జాదవ్ కేసుకు సంభందించిన సమాచారం అందించడంకోసం  13 మంది భారతీయ అధికారులతో భేటీ అయ్యేందుకు మేము ప్రయత్నాలు చేసినా సరే భారత్ సహకరించలేదు అని “డాన్‌” పత్రిక వివరించింది.  

 Image result for kulbhushan jadhav

అయితే జాదవ్‌ పై ఉగ్రవాదం..విద్రోహచర్యల వంటి అనేక కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఈ కేసులపై విచారణ జరుగుతోందని అయితే తాజా కేసుకి సంభందించి సైనిక ట్రిబ్యునల్‌ కొనసాగిస్తుందా లేక కోర్టులో నిర్వహిస్తారా అన్న అంశంపై ఈ వర్గాలు ఎటువంటి వివరణ తెలుపలేదు..జాదవ్‌పై తాజాగా నమోదయిన ఉగ్రవాదం కేసు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమకి అనుకూలంగా ఉంటుందని తమ వాదనలని న్యాయస్థానం బలపరుస్తుందని అంటున్నారు అధికారులు.

 Related image

 


మరింత సమాచారం తెలుసుకోండి: