ఎన్నారైలపై కేంద్రపభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది..భార్యలని వదిలేసి విదేశాలకి వెళ్ళిపోయిన ఎన్నారైలు కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు..అటువంటి ఎన్నారైలపై కేంద్రం చర్యలకి ప్రణాళిక సిద్దం చేస్తోంది. భార్య నుంచీ తప్పించుకోవాలని చూసే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది..ఈ విషయం ఇప్పుడు అలాంటి ఎన్నారైలకి అతి పెద్ద షాక్ ఇచ్చింది...

 Related image

ఈ కొత్త చట్టం కోసం కేంద్రం ఎన్నో విధాలుగా ఆలోచన చేసి భాదిత మహిళలకి న్యాయం చేసేలా చట్టాన్ని రూపొందించుతోంది .. ఈ విషయానికి సంభందించి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ సంబంధించిన వివరాలను అందించారు..భార్యలను వదిలేసి వెళ్లిపోయే ఎన్నారై భర్తల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి వీలు కల్పిస్తూ క్రిమినల్ చట్టంలో కీలకమైన మార్పులు తేవాలని ఆలోచిస్తున్నట్ల మేనకా గాంధీ చెప్పారు.

 Image result for nri hubands harrasments

భార్యలు పంపే సమన్లు తీసుకోకుండా వారు ఇచ్చే మూడు నోటీసుల తరువాత కూడా స్పందించకుండా ఉండే వ్యక్తులని ఈ చట్టం పరిధిలోకి తీసుకు వస్తారు...అటువంటి వ్యక్తులకు, ఆ వ్యక్తుల కుటుంబాలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి  ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు అధికారాలు ఆ శాఖా వర్గాలు తెలుపుతున్నాయి..విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో సమన్లను పోస్టు చేస్తే వాటిని అందించినట్లుగా భావించే విధంగా కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రోసీజర్ (సిఆర్పీసి)లో సవరణలు చేయనున్నట్లు శ్రీవాత్సవ తెలిపారు. అటువంటి మూడు సమన్లు వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాత కూడా స్పందించకపోతే సమన్లను తీసుకోవడాన్ని దాటవేస్తాడని భావించాల్సి వస్తుందని అన్నారు... అయితే దాదాపుగా 2015 జనవరి నుంచి 2017 నవంబర్ వరకు తమ భర్తలపై 3,328 మంది ఎన్నారై భార్యలు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు...అయితే ఈ పరిణామాల దృష్ట్యా ఎంతో మంది భాదిత మహిళలకి న్యాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మేనకా గాంధీ.

 Related image

 


మరింత సమాచారం తెలుసుకోండి: