భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుని డబ్బు సంపాదించి ఆర్థికంగా స్థిరపడాలని  భావించి కువైట్ వెళ్లి అక్కడే మగ్గిపోతున్న గడువు ముగిసిన ఎంతో మంది ఏపీ ప్రజలకోసం..ప్రవాసుల కోసం ఏపీ ప్రభుత్వం చొరవ చూపింది..అక్కడి ప్రభుత్వం క్షమాబిక్షని ఉపయోగించుకుని..ఏపీ ఎన్‌ఆర్‌టీ(నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ) సమకూర్చిన ఉచిత టికెట్లతో దాదాపు 3 వేల మంది ప్రవాసాంధ్రులు తొలి విడతలో తిరిగి రానున్నారు.

 apnrt help to kuwait ap people కోసం చిత్ర ఫలితం

ఏపీ ఎన్ఆర్టీ ఇప్పటికే ప్రభుత్వం తరువున ప్రవాసులకోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది..అమరావాతి వేదికగా ఎంతో మంది విదేశాలు వెళ్ళే వారికి శిక్షణ ఇస్తూ వారికి అక్కడ ఏర్పడే ఇబ్బందుల గురించి సూచనలు చేస్తుంది..ఎవరైనా సరే అక్కడ సమస్యలని ఎదుర్కుంటే వాటిని పరిష్కరించి సాహం చేయడం ఎన్ఆర్టీ ముఖ్య ఉద్దేశ్యం..

 సంబంధిత చిత్రం

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల ప్రకారం ఇప్పుడు అక్కడ మగ్గుతున్న వారు అందరు సొంత ఊళ్ళకి వెళ్ళడానికి అదే సమయంలో తమ తమ సొంత అప్రాంతాలలో మూడు నెలల పాటు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి సీఈవో కె.సాంబశివరావు తెలిపారు..అయితే ఈ శిక్షణ కాలంలో నెలకి 3 వేళా రూపాయలు బృతిగా ఇస్తారు..అంతేకాదు వ్యాపారం కోసం వారికి ఎలాంటి సాయం కావాలో వాటికి సంభందించిన ఆర్ధిక చేయూత వివిధ పధకాల ద్వారా అందేలా చేస్తారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: