గల్ఫ్ ఉద్యోగం అంటే తప్పకుండా అభ్యర్ధులు ఒక పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అంటూ కొత్త నిభందన విధించారు..ఈ నిభంధనతో మరింతగా గల్ఫ్ వచ్చే అభ్యర్ధుల విషయంలో ఒక అవహాగన ఉంటుందని అన్తున్నారూ..ఇంతకీ ఆ సర్టిఫికెట్ ఏంటి అంటే..గల్ఫ్‌ దేశాలలో ఉద్యోగం కోసం అభ్యర్థులు మంచి ప్రవర్తన సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. యూఏఈ ప్రభుత్వం గత నెలలో ప్రవేశపెట్టిన కొత్త నిభందన

 Image result for gulf job uae ask pcc certificate

యూఏఈ ప్రభుత్వం ప్రవేసపెట్టిన నిభంధనలలో ఇదీ ఒక తప్పనిసరి నిభందన అయ్యింది నిబంధనల్లో ఒకటైన పీసీసీ (పోలీస్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌)కు సంబంధించిన వివరాల కోసం పాస్‌పోర్టు, వీసా సమస్యలను పరిష్కరించే సంస్థలు ఇండియన్‌ మిషన్‌, బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌కు ఉద్యోగార్థుల నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. అయితే ఈ పీసీసీ సర్టిఫికెట్‌ పొందడం చాలా తేలికని బీఎస్‌ఎల్‌ ఇంటర్నేషల్‌ సంస్థ అధికారులు తెలియజేస్తున్నారు.

 Image result for gulf job uae ask pcc certificate

అయితే ఈ పీసీసీ సర్టిఫికెట్ పొందాలంటే ముందుగా బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పీసీసీ ఫారంను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, లేదా నేరుగా బీఎల్‌ఎస్‌ సెంటర్‌ నుంచి కూడా పొందవచ్చు, దానితో పాటుగా జాబ్‌ ఆఫర్‌ లెటర్‌, కంపెనీ ట్రేడ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, వీసాల జిరాక్స్‌ కాపీలను నాలుగు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జతచేసి సబ్మిట్‌ చేయాలి. తర్వాత ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి ఆమోదం పొంది, మళ్లీ తిరిగి బీఎల్‌ఎస్‌ కార్యాలయంలో ఇవ్వాలి. దాంతో అధికారులు దృవీకరించుకున్న తరువాత వివరాలు చరవానికి అందుతాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: