గత నెలలో పార్లమెంట్ లో విదేశాంగ శాఖామంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించిన 39   భారతీయుల మరణ వార్త ప్రకటనతో  ఇండియా మొత్త నివ్వెర పోయింది..అంతమంది భారతీయులని పొట్టనపెట్టుకున్న ఐసిస్‌  చర్యలని అన్ని దేశాలు ఖండించాయి..అక్కడ అధికారులతో మాట్లాడి మృతదేహాలని ఇండియాకి రప్పిస్తామని చెప్పిన కేంద్రం ఆదిసగా అధికారులతో మాట్లాడి వారిని ఇండియా కి తీసుకు వచ్చే చర్యలు చేపట్టింది..ఆ క్రమంలో భాగంగానే 39 మ్రుతదేహాలకి గాను 38 మందిని సోమవారం స్వదేశానికి చేరుకున్నాయి..అయితే  39 మందిలో ఒక మృతదేహానికి ఇంకా పరీక్షలు నిర్వహించాల్సిన ఉండగా మిగిలిన మృతదేహాలు ఇండియాకి పంపారు.

 Image result for 39 killed indians ded bodys back to india

అన్ని ఏర్పాట్లతో “ఆర్మీ”  విమానంలో బాగ్ధాద్‌ నుంచి అమృత్‌సర్‌(పంజాబ్‌)కు తరలించారు. విదేశాంగ శాఖ మంత్రి  సుష్మా స్వరాజ్ సూచనమేరకు సహాయ మంత్రి వీకే సింగ్‌ స్వయంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. మృతదేహాలను తీసుకొచ్చేందుకుగానూ సింగ్‌ ఆదివారం ఆర్మీకి చెందిన విమానంలో బాగ్ధాద్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే...అయితే చనిపోయిన వారిలో ఎక్కువ మంది పంజాబీలే కావడం గమనార్హం.ఈ మృతదేహాల తరలింపులో భారత రాయయార కార్యాలయం కీలక పాత్ర పోషించింది.

 Related image

ఇదిలాఉంటే మృతదేహాలని తీసుకురావడానికి మంత్రి వీకే సింగ్ కూడా వెళ్ళడం గమనార్హం..అయితే ఇండియాకి వచ్చిన తరువాత విలేఖరులు అడిగిన ప్రశ్నపై మంత్రి మండి పడ్డారు .. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తారా..?  అని విలేఖరులు “ఇది ఫుట్‌బాల్‌ ఆడినట్లో లేదా బిస్కెట్లు తయారుచేసినంత సులువైన పనికాదు. ఇప్పటికిప్పుడు పరిహారంపై నన్నడిగితే ఏం చెప్పాలి? కేంద్రం, రాష్ట్రాలు ఉమ్మడిగా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అప్పటిదాకా నేనేమీ చెప్పలేను” అంటూ మండి పడ్డారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: