ఎంతో మంది పేద కుటుంభాలు విదేశాలలో డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు అనే ఉద్దేశ్యంతో పొట్ట చేత పట్టుకుని భార్యా పిల్లలు ,తల్లీ తండ్రులని వదిలి దుబాయి ,కువైట్ లాంటి సుదూర దేశాలకి వెళ్ళిపోతూ అక్కడ కూలీ నాలి చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు..అయితే అక్కడ హటాత్తుగా ఎవరినా చనిపోయినా అనారోగ్యం బాగోక పోయినా ఒక్క సారిగా వారి వారి ప్రాంతాలకి తిరిగి రావాలి అంటుకుంటే మాత్రం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం అయితే ఏపీ ప్రభుత్వం ఏపీ నుంచీ విదేశాలకి వెళ్ళే వారికోసం ఓ భీమా పధకాన్ని ప్రారంభించింది..అదేమిటంటే..

 Image result for ap nri insurance

ఏపీ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ సహకారంతో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఓ భీమా పథకాన్ని అమలుచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చంద్రన్న బీమా తరహాలో ఈ పథకానికి రూపకల్పన చేశారు.ఈ భీమా లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే చాలు మూడేళ్ళ వరకూ కూడా ఈ పధకం యొక్క లబ్ధిని పొందవచ్చు..అయితే ఈ భీమా కోసం చెల్లించేది కేవలం 150. రూపాయలు మాత్రమే  ప్రవాసాంధ్ర ఉద్యోగులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

 

 Image result for ap nri insurance

అయితే ఈ పధకంలో చేరే వ్యక్తులు మాత్రమే తప్పనిసరిగా ఉండవలసిన అవసరం లేదు..తన కుటుంభ సభ్యులు ఎవరైనా సరే ఆ వ్యక్తి తరుపున ప్రీమియం కట్టవచ్చు..ఈ ప్రక్రియ ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 16వ తేదీదాకా కొనసాగుతుంది..లబ్దిదారులు లేక వారి తరఫు కుటుంబసభ్యులు పూర్తిచేసిన తమ దరఖాస్తులను వెలుగు సభ్యులకు లేక ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్స్‌ తెలుగుసొసైటీ కో-ఆర్డినేటర్లకు అందించాల్సి ఉంటుంది.

 

పధకం ముఖ్య మైన  ఉపయోగాలు

పధకంలో గల వ్యక్తి విదేశాల్లో అనుకోని సందర్భంలో మరణిస్తే మృతదేహాన్ని విమానంలో తీసుకొచ్చి, స్వస్థలంలో ఆయన కుటుంబసభ్యులకు అప్పగించేదాకా, అయ్యే ఖర్చులో కొంత ప్రభుత్వం భరిస్తుంది...అంతేకాదు మృతదేహానికి, వెంట ఉన్న వ్యక్తికి అయ్యే విమాన ఖర్చులను పెట్టుకొంటుంది. విమానంలోంచి ఆ మృతదేహాన్ని అతని స్వగ్రామంలో దించే వరకూ కూడా అండగా ఉంటుంది..

అంతేకాదు  లబ్ధిదారు శాశ్వత అంగవైకల్యం వస్తే ఆ కుటుంభానికి  రూ.10 లక్షలు బీమా అందిస్తారు. ఆ స్థితిలో ఉన్న ఆయనను స్వదేశం తీసుకెళ్లాలని కుటుంబసభ్యులు భావిస్తే, ఆయనకు, వెంట ఉన్న సహాయకుడికి విమానంలో సాధారణ టికెట్‌ను బుక్‌ చేస్తారు. ఏదైనా ప్రమాదంలో గాయపడిన సందర్భంలో.. అందుకు లబ్ధిదారుకు అయ్యే చికిత్సఖర్చుల కింద రూ.ఒక లక్ష చెల్లిస్తారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: