ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నాటినుంచీ ఇప్పటి వరకూ కూడా ఎన్నో సంచలన నిర్ణయాలని తీసుకుంటూ వచ్చారు..అయితే  ఎన్నికల హామీలో ముఖ్యమైనదిగా అమెరికన్స్ భావిస్తున్న స్వదేశీ ఉద్యోగాల విషయంలో ట్రంప్ ఎంతో ఖటినంగా వ్యవహరిస్తున్నాడు..భారతీయ టేకీలే టార్గెట్ గా ట్రంప్ సర్కీర్ తీసుకుంటున్న నిర్ణయం ఎంతో మంది భారతీయులకి దిక్కు తోచని స్థితికి తీసుకువెళ్తోంది..

 

హెచ్‌-1బీ వీసాలున్న వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఇతరత్రా పని చేసుకునేందుకు అవకాశం కల్పించే హెచ్‌-4 వీసాల జారీని ఎత్తేయాలని నిర్ణయించింది..ఈ నిర్ణయం సుమారు 72,000 మంది భారతీయులని రోడ్డు పాలు చేయనుంది. అమెరికా పౌరసత్వం - వలస సేవల విభాగం(యూఎ్‌ససీఐఎస్‌) జూన్‌ - జూలైల నుంచి హెచ్‌-4వీసాల వర్క్‌పర్మిట్లను ఆపేస్తామని అధికారికంగా ప్రకటించింది..యూఎ్‌ససీఐఎస్‌ డైరెక్టర్‌ ఫ్రాన్సిస్‌ సిస్నా -చుక్‌ గ్రాస్లీ అనే సెనేటర్‌కు పంపిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు.

 Image result for Blow To Indians, US Plans End To Work Permits For H-1B Holders' Spouses

అయితే ఈ కొత్త రూల్స్ ని పూర్తిస్థాయిలో అమలు జరగాలంటే ప్రజాభిప్రాయం తీసుకుంటామని ఆమె ప్రకటించారు. ఇమిగ్రేషన్‌ సేవల విభాగం లెక్కల ప్రకారం 2017 జూన్‌ నాటికి మొత్తం 71287మందికి ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్స్‌ (ఈఏడీ) జారీ చేసింది. వీటినే హెచ్‌-4 వర్క్‌ పర్మిట్లంటారు. ఇందులో 71,000 మంది భారతీయులే.. వీరిలో 93 శాతం మహిళలే ఉండటం గమనార్హం..అయితే ఆమె మాట్లాడుతూ ‘ముఖ్యంగా రెండు మార్పులు తెస్తున్నాం. మొదటిది ఎలకా్ట్రనిక్‌ రిజిస్ట్రేషన్‌ పద్ధతి. రెండోది ఉద్యోగంలో ఉండే ప్రత్యేకత ఏంటన్న దాని నిర్వచనం మార్పు. ఉద్యోగానికి సంస్థకి పని చేసేవారికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది నేది కూడా పరిగణలోకి తీసుకుంటామని ఆమె తెలిపారు...ఏది ఎమైనా సరే ట్రంప్ సర్కార్ నిర్ణయం వలన ఎంతో ఎంతో మంది భారతీయ కుటుంభాలు రోడ్డున పడే అవకాశం ఉందనే ఆందోళనలో ఉన్నారు టెకీలు.


మరింత సమాచారం తెలుసుకోండి: