విదేశాలలో స్థిరపడాలని ఎంతో ఆశగా వెళ్లి అక్కడ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు భారతీయ ఎన్నారైలు అంతేకాదు అక్కడ ఎన్నోసేవా కార్యక్రమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు అయితే ఒక ఎన్నారై మాత్రం అందుకు విరుద్దంగా ఒక దారుణానికి తెగబడ్డాడు..దేశం కాని దేశంలో భారత్ పరువు తీసేశాడు..డేటింగ్ కి ఒప్పుకోలేదని ఆమె బాయ్ ఫ్రెండ్ ని అత్యంత దారుణంగా హతమార్చాడు..ఈ సంఘటన అమెరికాలో కలకలం సృష్టించింది..వివరాలలోకి వెళ్తే..

 Image result for san-francisco-airport-employee-murders-co-worker-s-boyfriend-after-she-refused-to-date-him

కెవిన్ ప్రసాద్ (31) అనే ప్రవాస భారతీయుడు శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ సేవలందిస్తున్నాడు. అదేచోట ఓ యువతి పనిచేస్తోంది. ఈమెను ఎలాగైనా లోబరుచుకోవాలని అనుకున్న అతడు పలుమార్లు ఆమెను డేటింగ్‌కు రమ్మని ఆహ్వానించాడు. నగలు, నగదు ఆశచూపి లోబరుచుకోవాలని అనుకున్నాడు ..అయితే, దాన్ని తిరస్కరించిన ఆమె, తనకు దీర్ఘకాలంగా మార్క్ మంగాక్కట్ (31) అనే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, తమకు మూడేళ్ల బిడ్డ కూడా ఉందని చెప్పి తప్పించుకునేది.

 Related image

అయితే ఈ సంఘటన జరిగిన క్రమంలోనే ఒక ముసుగు ధరించిన యువకుడు మంగాక్కట్ కారు వద్దకు వచ్చి అతన్ని తుపాకితో కాల్చి చంపాడు...ఇదేసమయంలో అతని గర్ల్‌ఫ్రెండ్ అయిన ప్రసాద్ సహోద్యోగినిని విచారిస్తున్న క్రమంలో, పనిచేసేచోట ఓ యువకుడు తనను డేటింగ్‌కు రావాలని ఒత్తిడి చేస్తుండేవాడని ఆమె చెప్పగా, పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు...దాంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.. హత్య చేశాడని పోలీసులు తేల్చారు. ఈ నేరం రుజువైతే ప్రవాస భారతీయుడికి మరణశిక్ష పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెపుతున్నారు. 

 Image result for san-francisco-airport-employee-murders-co-worker-s-boyfriend-after-she-refused-to-date-him


మరింత సమాచారం తెలుసుకోండి: