ట్రంప్ ఎఫెక్ట్ ఈ సారి అమెరికాలో ఉంటూ చదువులని కొనసాగిస్తున్న ఎన్నారై విద్యార్ధులపై పడింది ముఖ్యంగా భారత ఎన్నారై విద్యార్ధులపై ఎక్కువగా ఈ ప్రభావం పడింది.. ఇప్పటికే ట్రంప్ తీసుకుంటున్న వీసా నిభంధనలతో ఎంతో మంది భారత ఎన్నారై లు , ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే..ఈ సారి భారతీయ విద్యార్ధులపై ట్రంప్ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు..వివరాలలోకి వెళ్తే..

 Image result for trump nri students visa conditions

 వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవలే ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది...ఈ కొత్త విధానం ఆగస్టు 9 నుంచి అమల్లోకి రానుంది...ఈ నిభంధనల ప్రకారం నిర్దేశిత కోర్సు సమయం ముగిసిన రోజు నుంచి లేదా అనుమతించిన గ్రేస్‌ పీరియడ్‌ ముగిసినప్పటి నుంచే విద్యార్థులు అక్కడ ఉన్న ప్రతి రోజునూ చట్టవిరుద్ధంగా ఉన్నట్టే భావిస్తారు...అయితే ఇప్పుడు వచ్చిన నిభంధనల ప్రకారం...అలాంటివారిని గుర్తించిన రోజు నుంచి చట్టవిరుద్ధంగా ఉన్నట్టు లెక్కిస్తున్నారు.

 Related image

ఒక విద్యార్ధి వీసా గడువు ఎదో ఒక నెలలో ముగిస్తే ఆ విద్యార్ధి మూడు నెలలు అక్కడే ఉన్నట్లుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తిస్తే అతడి ఉనికిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తున్నారు..కొత్త నిబంధనల ప్రకారమైతే.. అక్టోబరు 1న కాలపరిమితి ముగిస్తే రెండో తేదీ నుంచి అతడు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్నట్టే..అయితే ఎన్ని రోజులు ఉంటే ఆ కౌంట్ ని బట్టి శిక్షలు ఉంటాయని తెలిపారు..ఒక విద్యార్థి వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత 180 రోజుల కన్నా ఎక్కువ రోజులు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే సదరు విద్యార్థిని డీపోర్ట్‌ చేసి మళ్లీ 3 నుంచి 10 సంవత్సరాల దాకా అమెరికలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. ఏడాది కన్నా ఎక్కువకాలం అక్రమంగా ఉంటే..ఆ విద్యార్ధి పై శాశ్వతంగా నిషేధం విధిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: