క్షనికావేసం లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశం కాని దేశం లో భారతీయులని ఉరి కొయ్య ఎక్కేలా చేస్తోంది ఇప్పుడు క్షమా బిక్ష కావాలని అంటూ న్యాయమూర్తిని వేడుకుంటున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14 మంది భారతీయులు మరణ శిక్షని ఎదుర్కోబోతున్నారు..అయితే న్యాయ మూర్తి ఇచ్చిన సమాధానంతో ఒకింత సంతృప్తి చెందారు ఇంతకీ ఈ 14 మంది కధ ఏమిటంటే..

 Related image

పంజాబ్, హర్యానాకు చెందిన పలువురు భారతీయులు ఉపాధి నిమిత్తం యూఏఈ వలస వెళ్లారు. షార్జాలోని అల్ సజా ఇండస్ట్రీయల్ ఏరియాలో నివాసముంటున్నారు. అయితే ఈ క్రమంలో రెండు గ్రూపులుగా విడిపోయారు. ఓ విషయంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ జరిగింది. దీంతో 14 మంది కలిసి ఇద్దరు యువకులను కత్తులతో దాడి చేసి చంపేశారు...ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితులని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు..ఈ ఘటన 2016 లో జరిగింది.

 Image result for 14-murder-convicts-seek-pardon-as-uae-expat-agrees-to-pay-blood-money

అయితే భారత్‌కు చెందిన డా. ఎస్పీ సింగ్ ఒబెరాయ్ బాధిత కుటుంబానికి  పరిహారం చెల్లించి సాయం చేస్తామని వీరికి క్షమా బిక్ష పెట్టమని అభ్యర్ధించారు.. బాధిత కుటుంబాన్ని కూడా కోర్టుకు తీసుకురావడంతో ఇరు వర్గాలు చర్చించుకుని తేల్చుకోవాలని, విచారణను వాయిదా వేస్తున్నామని న్యాయమూర్తి వెల్లడించారు..అయితే ఈ కేసులో 14 మందికి గాను ఇద్దరుకి ముందుగానే బెయిల్ వచ్చింది..మిగలిన 12 మందికి కోర్టు తీర్పు పెండింగ్ లో ఉందని భారత వర్గాలు తెలిపాయి

 

 

 

.

 

.


మరింత సమాచారం తెలుసుకోండి: