హెచ్ -1బీ వీసా విషయంలో ఎన్నారై లని ముప్పు తిప్పలు పెట్టిన అమెరికా ప్రభుత్వం ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టనుందా..? తమ దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్రమైన పభావం చూపనున్న నేపధ్యంలో అమెరికా ప్రభుత్వం ఈ వీసాల విషయంలో వెనకడుగు వేయనుందా..? అంటే అవుననే చెప్పాలి..తాము విధించిన ఆంక్షలపై త్వరలోనే వెనకడుగు వేయనుంది అనే విషయాన్ని ఢిల్లీ లోని అమెరికా డిప్యూటీ చీఫ్‌ ఆఫ్ మిషన్‌ మేరీ కే ఎల్‌ కార్ల్‌సన్‌ చూచాయిగా తెలిపారు..

 Image result for marykay carlson

ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతని సంతరించుకున్నాయి...తమ దేశ పౌరులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగా హెచ్‌1-బీ ట్రంప్ విధించిన ఆంక్షలు అందరికి తెలిసినవే అయితే ఈ ఆంక్షల వలన భారత ఎన్నారైలు ఎంతగా ఇబ్బంది పడ్డారో వేరే చెప్పనవసరం లేదు.

 Image result for marykay carlson

అయితే ఈ వీసా విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని అలాగే  హెచ్‌-4 వీసాల్లోనూ కొత్త మార్పులేమీ చేయట్లేదని ర్ల్‌సన్‌ చేసిన వ్యాఖ్యలు భారత టెకీలకి ఊరట ఇచ్చాయి..ఢిల్లీ లోని  భారత్‌, అమెరికాల మధ్య ఉన్నత విద్యకు సంబంధించిన సంబంధాల నేపథ్యంలో చేపట్టిన ఒక కార్యక్రమంలో ఆమె పలు విషయాలు వెల్లడించారు మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల్లో 17 శాతం మందితో భారత్ రెండవ స్థానంలో ఉందని కార్ల్‌సన్‌ వెల్లడించారు..అయితే ఈ నిర్ణయం వెనుక అమెరికాలో ఆర్ధిక పరమైన మార్పులు ఏమైనా జరిగి ఉన్నాయా అంటూ నిపుణులు ఆకోణంలో ఆలోచన చేస్తున్నారు..ఏది ఏమైనా తాజాగా ఆమె చెప్పిన వార్త ఎంతో మంది భారత ఎన్నారై లకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: