ఏపీ నుంచీ ఎంతో మంది గల్ఫ్ దేశాలకి ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు అక్కడ పని చేస్తే డబ్బులు ఎక్కువగా సంపాదించవచ్చు అనే కారణంగా ఎంతో మంది అక్కడకి వలస కూలీలుగా వెళ్తూ ఉంటారు అంతేకాదు మగవారితో పాటుగా ఎంతో మంది స్త్రీలు అక్కడే జీవనోపాది కోసం వెళ్తూ ఉంటారు అయితే ఈ క్రమంలోనే ప్రతీ ఏటా 5 వేల మందికి పైగా మహిళలు ఏజెంట్ల మోసాలకు బలై.. అనారోగ్యానికి గురై మృతి చెందుతున్న సందర్భాలు అనేకం..ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న ప్రజలు నకిలీ ఏజంట్ల ని నమ్ముకుని మోసపోతూ ఉంటారు.

 Image result for ap govt

అలా గల్ఫ్ వెళ్ళే స్త్రీలు మోసపోకూడదు అనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అందుకు గాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తొలి అడుగువేసింది. కొందరు టూరిస్టు, విజి ట్‌ వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళ్లి అనధికారికంగా అక్కడ ఇంటిపనిలో చేరుతున్నారు...వీరిలో కొందరి పాస్‌ పోర్టులు కూడా నకిలీవే. దీంతో పట్టుబడితే జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతా వారంతా యజమానులు ఎన్ని చిత్రహింసలు పెడుతున్నా భరిస్తున్నారు.

 Image result for ap womens in gulf countries

అయితే ఇలాంటి మహిళలకి రక్షణ కల్పించేందుకు స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌ నడుం బిగించింది. విదేశీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు.. అధికారికంగా ఉద్యోగాలతో కూడిన వీసాతో గల్ఫ్‌ దేశాలకు పంపించడం ద్వారా మహిళలకు భద్రత కల్పించేలా కార్యాచరణ రూపొందించింది. ఈ క్రమం లో ఏపీ ప్రవాస తెలుగు సంస్థ(ఏపీ ఎన్‌ఆర్‌టీ) సహకారాన్ని తీసుకుంది. అలాగే ఓం క్యాప్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది...అలాగే నర్సు ఉద్యోగాలకి  500 మంది కావాలని ఓంక్యా్‌పను గల్ఫ్‌లోని సంస్థలు కోరాయి. రంజాన్‌ తర్వాత పాసుపోర్టున్నవారితోనూ ఈ నెల 19 నుంచి 29 వరకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

 Image result for womens suffering in gulf countries

అయితే అక్కడికి వెళ్ళే వారికి భద్రతా ఎలా కల్పిస్తారంటే  ప్రభుత్వం  “ఓం క్యాప్‌” తో ఒప్పందం చేసుకున్నందున.. ఆ సంస్థ అధికారికంగా గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలపై సమాచారం ఇస్తుంది...అక్కడి యజమాన్యాలతోనూ, సంస్థలతోనూ ఓంక్యాప్‌ ఒప్పందం చేసుకుంటుంది. అధికారికంగా ఉద్యోగ భర్తీ చేపడుతుంది..ఫలితంగా మహిళలు చట్టపరంగా పాస్‌పోర్టులూ, వీసాలతో గల్ఫ్‌ దేశాలకు వెళతారు. అక్కడి చట్టాల నుంచి రక్షణ పొందుతారు..ఇంతటి పకడ్బందీగా రక్షణ చర్యలుఉంటాయి కాబట్టి  మహిళల పై మోసాలు దాడులు జరగవు అని ప్రభుత్వం తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: