ట్రంప్ పేరు చెప్తేనే వలసదారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి..వీసాల విషయంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియక ముఖ్యంగా భారతీయ ఎన్నారైలు ఆందోళన చెందుతున్నారు అయితే అందరూ ఊహించిన విధంగానే ట్రంప్ అనుకున్న పని కి పూనుకున్నాడు...ఇన్నాళ్లు హెచ్‌ - 1బీ​ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్‌ తాజాగా మరో బాంబ్‌ పేల్చారు. తాజాగా ఈబీ-5 వీసాలపై ట్రంప్‌ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

 Image result for eb-5 visa trump decision

విదేశాలలో పెట్టుబడి పెట్టాలని అనుకునేవారికి జారీ చేసే ఈబీ -5 వీసా లో మార్పులు తేవాలి అనుకుంటున్నారు...ఈబీ -5 వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్‌ జాబ్‌ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్‌ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్‌ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్‌ కాంగ్రెస్‌ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

 Image result for eb-5 visa trump decision

ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్‌ యంత్రాంగం యూఎస్‌ కాంగ్రెస్‌ను కోరింది.. ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్‌ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్‌ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: