ధనమేరా అన్నిటికీ మూలం అనే ఒక సూక్తి ఉంది అవును డబ్బు అన్ని అనర్దాలకి కారణం ..డబ్బు ఎన్నో మంచి పనులకి కారణం వీటిలో మంచి చెడూ రెండూ ఉంటాయి..అయితే రెండు రోజుల క్రితం అరుణా మిల్లర్ అనే తెలుగు ప్రవాస భారతీయురాలు అమెరికాలో అమెరికన్ కాంగ్రెస్ లో కి వెళ్ళాలని అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అన్న విషయం  విదితమే అయితే ఈ ఎన్నికల ఫలితాలలో అరుణా మిల్లర్ ఓటమి పాలయ్యారు అయితే గెలుపొందిన డేవిడ్ ట్రోన్‌ గెలుపుకి..అరుణా మిల్లర్ ఓటమికి ప్రధానమైన కారణం డబ్బు ఒక్కటే..

 Related image

ఈ ఎన్నికల కోసం రూ.65 కోట్లు ఖర్చు పెట్టిన ఆమె ప్రత్యర్థి డేవిడ్‌ ట్రోన్‌ విజయం సాధించాడు. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో అడుగుపెట్టాలనుకున్న అరుణ మిల్లర్ ఆసలు అడియాసలు అయ్యాయి.. ఆమె విజయం సాధించినట్లయితే వాషింగ్టన్ రాష్ట్రం నుంచి అమెరికా ప్రతినిధుల సభలోకి ప్రవేశించిన రెండవ ప్రవాస భారతీయ మహిళగా చరిత్ర సృష్టించి ఉండేది...అయితే ఈ ఎన్నికల్లో తిరుగులేదు అరుణ కి అనుకున్న సమయంలో ఆమె ఓటమికి ప్రధాన కారణం డబ్బు అందులో పాటుగా ఆమెతో పాటుగా.. ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడటం వల్లనే ఆమె విజయం కష్టంగా మారింది.

 Related image

అయితే ఈ ఎన్నికల్లో  డేవిడ్‌ ట్రోన్‌ 22,855 ఓట్లు దక్కగా, మిల్లర్‌ గట్టి పోటీనిచ్చి 17,311 ఓట్లను దక్కించుకుంది అరుణా మిల్లర్ కేవలం 5,544ఓట్ల తేడాతో ఓడిపోయింది..వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన అరుణా మిల్లర్ మన తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడగలదు. వర్జీనియా, హవాయ్, కాలిఫోర్నియాలతోపాటు మౌంట్‌గొమెరీ కౌంటీలో పాతికేళ్లపాటు రవాణాశాఖలో ఇంజినీరుగా ఆమె సేవలందించారు...అయితే అరుణా మిల్లర్ ఓటిమి పట్ల భారత ఎన్నారైలు ఎంతో విచారాన్ని వ్యక్తం చేశారు..

                                                                                                                        


మరింత సమాచారం తెలుసుకోండి: