ఎన్నారైల వలసలపై ట్రంప్ పభుత్వం తీసుకుంటున్న విధానాలకి తగ్గట్టుగా మరింత కటినమైన చర్యలకి సిద్దమవుతున్నారు..ఇప్పటికే వీసాల విషయంలో ఎన్నో కొరీలు పెడుతున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు తాజగా ఒక మరొక కొత్త నిభంధానని తెరపైకి తీసుకు వచ్చారు దీంతో ఇప్పటికే వీసాలు ఉన్న వారు కూడా ఎంతో ఆందోళనకి లోనవుతున్నారు..అయితే తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వీసా పొందిన వారిని కూడా ఇంటికి సాగనంపాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

 Image result for h1-b visa

ఇకపై హెచ్1బీ వీసాల గడువు ముగిసిన తర్వాత మళ్లీ  గడువుని పెంచుకోవడం కోసం  వీసాదారులు దరఖాస్తు చేసుకుంటారు...ఆ వీసాలో ఏదన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలని అనుకుంటే చేస్తూ ఉంటారు..అయితే ఈ క్రమంలో సదరు వ్యక్తి వీసాలు రిజక్ట్ అయ్యే అవకాసం ఉంటుంది అంటున్నారు ఇమ్మిగ్రేషన్ అధికారులు కొత్తగా వచ్చిన నిభందన ఇదే అంటున్నారు..ఐతే ఒక వేళ ఆ వేసా గనుకా తిరస్కరించబడితే వారు దేశం వదిలి వెళ్లాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి పేర్కొన్నారు..

 Image result for h1-b visa

అయితే ఈ కొత్త నిభందనలు తాజాగా అమలులోకి వచ్చాయని అంటున్నారు..అయితే గతంలో హెచ్1 బీ వీసా గడువు ముగిస్తే అమెరికా నిభందనలు ప్రకారం సుమారు  240 రోజులు అమెరికాలో పని చేసే వీలుంది. మరి తాజాగా వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం గడువు ముగిసి, గడువు పెంపు దరఖాస్తు కూడా తిరస్కరణకు గురయితే వెంటనే 'నోటిస్ టు అప్పియర్' ఇష్యూ చేస్తారు. ఆ సమయంలో వీసాదారుడు విచారణ ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒకవేళ వీసాదారుడు అందుబాటులో లేక విచారణకు హజరుకాకపోతే అతడిపై అయిదేళ్ల పాటు దేశంలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తామని ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి తెలిపారు..

 


మరింత సమాచారం తెలుసుకోండి: