కొన్ని రోజుల క్రితం తెలుగు ఎన్నారై స్టూడెంట్ శరత్ అమెరికాలో ఒక విదేశీయుడు చేసిన కాల్పుల దాడిలో మరణించిన విషయం అందరికీ తెలిసిందే కన్సాస్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఈ ఘటనలో వరంగల్ కి చెందిన శరత్ ప్రాణాలు కోల్పోయారు..ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళిన తమ కొడుకు ప్రాణాలు పోగొట్టుకుని ఇలా ఇంతకి వస్తాడని అనుకోలేదని శరత్ తల్లి తండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు

 Image result for nri student sarath died

అయితే ఈ క్రమంలో శరత్ ఆత్మకి శాంతి కలిగేలాంటి వార్త అమెరికా పోలీసులు వెల్లడించారు..శరత్ తల్లి తండ్రులకి ఈ వార్త కొంత ఊరటని ఇస్తుందేమో ఇంతకీ ఆ వార్త ఏమిటింటే.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శరత్‌పై కాల్పులకు దిగిన దుండగుడిని మిస్సోరీ పోలీసులు గుర్తించారు. కెన్సాస్ శివార్లలో ఉన్నట్టు తెలుసుకుని అక్కడకు వెళ్లి, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. 

Image result for nri student sarath died

 అయితే ఆ నిదితుడిని లొంగిపోవాలని పోలీసులు ఎంతగానో హెచ్చరించారు సరికదా నిందితుడు లొంగకుండా పోలీసులపై కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిగిపారు..దాంతో హంతకుడు హతమయ్యాడు....ఈ విషయంపై దీనిపై కెన్సాస్ సిటీ పోలీస్ చీఫ్ రిక్ స్మిత్ ట్వీట్ చేశారు. లొంగిపోవాలని ఆదేశిస్తే నిందితుడు తన రైఫిల్‌తో కాల్పులు జరిపాడని, దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు జరపడంతో అతను మరణించాడని చెప్పారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: