అమెరికాలో వీసా నిభంధనలపై ఇప్పటికే సర్వత్రా నిరసనలు తెలుపుతుంటే..అవి చాలవన్నట్టుగా ట్రంప్ ప్రభుత్వం మరో నిభందన పేరుతో  హెచ్1 బీ వీసా దారులకి చుక్కలు చూపిస్తోంది..ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత వీసాలపై మరిన్ని నిభందనలు పెట్టి ఎన్నారై ఉద్యోగులని అమెరికా నుంచీ వెళ్ళగొట్టడమే పని గా పెట్టుకున్నాడు..అయితే తాజాగా పెట్టిన విధానంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే అవకాశం లేదని తెలుస్తోంది..వివరాలలోకి వెళ్తే..

 Image result for Prevent jobs from going to H-1B visa holders: USCIS director

అమెరికా హెచ్ 1 బీ విషయంలో మరో మరో సంచలన ప్రకటన చేసింది..అమెరికాలోని ఉద్యోగాలను, ఉద్యోగులను హెచ్1బీ వీసాదారులతో భర్తీ చేయకుండా ఖటినమైన బిల్లుని సభలోకి తీసుకు వచ్చి మరీ ఆ బిల్లుకు  యూఎస్ కాంగ్రెస్ ఆమోదం తెలిపేలా చేయాలని ప్రయత్నాలు చేస్తోంది..అయితే ఈ బిల్లు పాస్ అయితే చాలా సంతోషమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్)డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా తెలిపారు.

 Image result for Prevent jobs from going to H-1B visa holders: USCIS director

2017లో యూఎస్‌సీఐఎస్ 3,65,000 దరఖాస్తుదారులకు హెచ్1బీ వీసాలను మంజూరు చేసినట్లు తెలిపారు.వలస సంస్కరణల వలన అమెరికా తన అవసరాలకి తగ్గట్టుగా ఉద్యోగాలని కల్పించేలా  సంస్థలకు ఉన్న సదుపాయాలపై నిషేధం విధించడమే దీనికి సరైన మార్గమని ఫ్రాన్సిస్ ఉద్దేశించారు..అత్యంత ప్రతిభావంతులకి మాత్రమే వీసాలని మంజూరు చేసేలా ప్రణాలికలు చేస్తున్నట్టుగా తెలిపారు అధికారులు..అయితే ఈ రకమైన విధానాలతో ఎన్నారైలు ముఖ్యంగా భారత ఎన్నారైల పరిస్థితి దారుణంగా మారనుంది అంటున్నారు పరిశీలకులు..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: