రానున్న 2019 ఎన్నికల్లో రాజకీయాలని ప్రభావితం చేసేది ఎన్నారై ఓట్లే అనడంలో సందేహం లేదని అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమవంతుగా ఎన్నారైలని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయని అంటున్నారు..ఎన్నారైల ఓట్లు కోల్పోకుండా .వారికోసం ప్రాక్సీ ఓటింగ్‌ విధానాన్ని ఏర్పాటు చేస్తోంది కేంద్రం...అందుకు తగ్గట్టుగా ఒక బిల్లుని కూడా రూపొందించింది..ఉపాది కోసం విదేశాలకి వెళ్ళిన వారు ఓటు హక్కు వినియోగించుకునేలా పరోక్ష ఓటు హక్కు అనే కొత్త విధానానికి నాంది పలుకుతోంది..

 Related image

ఈ క్రమంలోనే ప్రజా సవరణ బిల్లు-2017ను లోక్‌సభ ఇటీవల ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్రతో చట్ట సవరణ అమల్లోకి వస్తుంది...అయితే తెలుగు రాష్ట్రాలలో ఎన్నారైల ఓటింగ్  శాతం చూసిన తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకి దిమ్మతిరిగిపోయింది..దాదాపు 40 లక్షల మంది ఎన్నారై ఓటర్లు ఇరు రాష్ట్రాలలో ఉండగా ఒక్క ఏపీ నుంచీ 22 లక్షల మంది ఓటర్లు ఉన్నారట.. తెలంగాణలో అయితే ఈ సంఖ్య 18 లక్షలకి చేరింది.

 Related image

ఇదిలాఉంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా నియోజకవర్గాలలో  ఎన్నారైల ఓట్లు కీలకం కానున్నాయి అందుకే ఎన్నారైల ఓట్లని దృష్టిలో పెట్టుకుని మరీ వారిపై వరాల జల్లు కురిపిస్తున్నారు రాజకీయ పార్టీల అధిపతులు.. అయితే ఇప్పటికి కూడా ఎన్నారైల పాట్లు పట్టించుకున్న పార్టీలు ఒక్కటి కూడా లేవని అధికారం లో ఉన్న పార్టీలు అయితే అసలు మా గోడు పట్టించుకోవడం లేదని అంటున్నారు అక్కడ ఎన్నారైలు...అయితే ఇప్పుడు రాజకీయాలు మాత్రం ఎన్నారైల చుట్టూ తిరుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: