గల్ఫ్ లో ఉన్న భారతీయ వలస కార్మికులు మరియు వ్యాపారవేత్తలు..మరే కారణాల ద్వారా అయినా గల్ఫ్ లో స్థిరపడిన భారతీయులకి బంపర్ ఆఫర్ వచ్చింది..ఈ ఆఫర్ కారణంగా ప్రవాశీయులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంతకీ వారి సంతోషానికి కారణం ఏమిటంటే..భారత్ లో రూపాయి విలువ పడిపోవడమే..అయితే ఈ సంబరాలు మాత్రం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న భారతీయులకి మాత్రమే...ఎందుకంటే డాలర్‌తో పోలిస్తే రూపాయి 71.79 కి పడిపోయింది.

 

అయితే ఈ క్రమంలో అక్కడ వారి జీతాలలో మార్పులు లేకపోయినా వారు అక్కడి నుంచీ మనీ ఎక్స్‌చేంజీల్లో డబ్బు ని మార్చుకుంటే మాత్రం భారత కరెన్సీ గతంలో కంటే ఎక్కువ మొత్తంలో వస్తోంది. దీంతో గతంలో కన్నా ఎక్కువ మొత్తాన్ని కుటుంబ సభ్యులకు పంపే వీలు కలిగిందని వారు అంటున్నారు. ఇటీవల ఉద్యోగాలు కోల్పోయినవారు కూడా తమ పీఎ్‌పను విత్‌డ్రా చేసుకుంటేఎక్కువ మొత్తం అందనుంది. ఈ నేపథ్యంలో డబ్బు స్వదేశానికి పంపేందుకు ప్రవాసీయులు మనీ ఎక్స్‌చేంజ్‌లకు క్యూ కడుతున్నారు.

 Image result for gulf money exchange

ఈ సందర్భంలో దుబా యి, కువైత్‌, మస్కట్‌, దమ్మాం, లలోని మనీ ఎక్స్‌చేంజ్‌లు సాయంత్రం వేళల్లో ప్రవాసీయులతో నిండిపోతున్నాయి..కాగా మరికొందరు మాత్రం రూపాయి మరింత క్షీణత కి వచ్చిన తరువాత  డబ్బు పంపించాలనే ఆలోచనతో ఉన్నారు...అయితే ప్రవాసీయుల నుంచీ అధ్యదికంగా డబ్బు చేరుతున్న ఏకైక దేశం భారత్ అని ఇప్పటికే గణాంకాలు తెలుపుతున్నాయి..

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: