భారత్ అంటే దేశవిదేశాలలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి..భారతీయులని ఏ దేశం వెళ్ళినా సరే ఎంతో మర్యాదగా గౌరవిస్తారు..అయితే ఈ గొప్పదనం భారతీయత, సంస్కృతీ సాంప్రదాయలపై ఆధారపడి ఉంటుంది. కానీ దేశాలు అన్నీ భారతీయులకి గౌరవం ఇస్తుంటే కొంతమంది మాత్రం విదేశాలలో భారత్ పరువు బజారుకి ఈడ్చుతున్నారు..తాజాగా జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్సనంగా నిలుస్తోంది..వివరాలలోకి వెళ్తే..

 Image result for call center scam

2012-16 మధ్య జరిగిన ఈ స్కాంలో ఇప్పటికే 21 మంది భారత సంతతి ప్రజలు, ముగ్గురు భారతీయులు 20 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కొంటుండగా..ఆర్ధిక అవసరాలలో ఉన్న వారిని టార్గెట్ గా చేసుకుంటూ చేసిన కుంభకోణం పై అమెరికా ఉక్కుపాదం మోపింది..ఈ కుంభకోణంలో తాజాగా 15 మందిపై నేరారోపణ నమోదు చేసింది. వీరిలో ఏడుగురు భారత సంతతి ప్రజలు ఉన్నారు. ఐదు భారత కాల్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ కాల్‌ సెంటర్లు అహ్మదాబాద్‌ కేంద్రంగా పని చేస్తున్నాయి.

 Image result for call center scam

అయితే వీటి నిర్వాహకులు ఇంటర్నల్‌ రెవెన్యూ సర్వీసె్‌స(ఐఆర్‌ఎస్‌) లేదా యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసె్‌స(యూఎ్‌ససీఐఎస్‌) అధికారులమంటూ ఫోన్లు చేసి రుణాలు (పేడే లోన్లు) ఇస్తామంటూ ఆఫర్‌ చేశారు. ఆ తరువాత ప్రభుత్వానికి పన్నులు, జరిమానాలు కట్టకపోతే అరెస్టులు తప్పవని బెదిరించి మరీ ఏకంగా  2వేల మందిని మోసం చేసి దాదాపు 55 లక్షల డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారని అమెరికా న్యాయశాఖ పేర్కొంది...వీరిపై ఖటినమైన చర్యలు తీసుకుంటారని భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అక్కడి పరిశీలకులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: