అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాకి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తరువాత తన తలతిక్క ప్రవర్తనతో అటు అమెరికాకి ఇటు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలకి పెద్ద తలనెప్పిగా మారిపోయాడు..అమెరికా అభివృద్దిలో ప్రముఖ పాత్ర పోషించేది కేవలం ఇతర దేశాల నుంచీ వలసలు వెళ్ళిన ఎన్నారైలే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే  ట్రంప్ ఎన్నికల హామీల అమలులో భాగంగా హెచ్1 బీ పై విధించిన నిభందనలు అన్నీ ఇన్నీ కావు ఈ దెబ్బతో అమెరికాలో ఉన్న ఎన్నారైలు తట్టా బుట్టా సర్దేసుకోవడమే అనుకున్న సందర్భంలో ట్రంప్ మరొక పిడుగు లాంటి వార్తా వినిపించాడు అదేంటంటే..

 Image result for eb-5 visa trump decision

అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈబీ-5వీసా...ఈ వీసా కోసం హెచ్1 బీ వీసా దారులు ఎంతో పోటీ పడుతున్న సమయంలో ఈబీ-5వీసా పై కూడా నిభందనలు కఠినతరం చేయనున్నారని వార్తలు వెలువడ్డాయి...ఈ వీసా లో పెట్టుబడిని 5మిలియన్‌ డాలర్లకు పెంచనున్నారని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు ఆరోన్‌ స్కాక్‌ చెబుతున్నారు. అయితే, పెట్టుబడి పెంపునకు సంబంధించి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఎలాంటి మార్పు ఉండబోందని అంటున్నారు.

 Image result for eb-5 visa trump decision

ఈ క్రమంలో శాశ్వత పౌరసత్వం కలిగే ఏకైక మార్గం ఈబీ-5వీసా కల కలగానే మిగిలిపోనుంది అంటున్నారు. కనీసం ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తేఅ.. గ్రీన్‌కార్డును ప్రభుత్వం వారికి ఇస్తుంది అయితే..త్వరలో ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠినతరం చేయనున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: