అమెరికా కేంద్రంగా పని చేస్తున్న పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ కి అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది..రెండ్మెండ్ కేంద్రంగా పీపుల్ టెక్ గ్రూప్ కంపెనీ ఐటీ కార్యకలాపాలు చేస్తోంది..అంతేకాదు ఈ కంపెనీకి వివిధ దేశాలలో ఆఫీసులు కూడా ఉన్నాయి..దాదాపు మూడు దేశాల్లో కలిపి 10 ఆఫీసులు వరకూ ఈ సంస్థకి ఉన్నాయి.. ఇండియా లో హైదరాబాద్ ,అధోని ,బెంగుళూరు లలో కూడా ఈ సంస్థకి చెందిన ఆఫీసులు ఉన్నాయి

 Huge Fine To US IT Firms - Sakshi

అయితే ఈ కంపెనీ లో పని చేస్తున్న ఉద్యోగులకి సరైన జీతాలు ఇవ్వని కారణంగా ఈ సంస్థకి అమెరికా ప్రభుత్వం భారీ జరిమానా విధించింది..తక్కువ జీతం ఇస్తున్నారని లేబర్ వేజ్ అండ్ హవర్ డివిజన్ విభాగం  గుర్తించడంతో  12 మంది హెచ్‌ 1 బీ ఉద్యోగులకు మూడు లక్షల డాలర్లను ఇవ్వాలని ఆ కంపెనీని ప్రభుత్వం  ఆదేశించింది. అలాగే ఆ కంపెనీ ప్రభుత్వ నిభంధనలకి విరుద్దంగా ఉండటంతో 45 వేల డాలర్ల ఫైన్‌ విధించింది. 

 Related image

 ఇదిలాఉంటే ఈ కంపెనీ హెచ్ 1 బి కంప్యూటర్ అనలిస్టులు, కంప్యూటర్ ప్రొగ్రామర్స్ గా పనిచేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎంట్రీ లెవల్ జీతాలు ఇస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. దాంతో ఎంతో అనుభవం ఉన్న ఈ ఉద్యోగులుకు భారీ జీతాలు ఇవ్వాల్సి ఉండగా కంపెనీ తక్కువ జీతంతో పనిచేయిస్తున్నారని అధికారులు  విచారణలో తెలుసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: